‘లియో’సెన్సార్ పూర్తి, స్టోరీ లైన్‌ పై క్లారిటీ, ‘కోబ్రా’ఎవరు?

‘విక్రమ్‌’లో రోలెక్స్‌లా ‘కోబ్రా’ పేరుతో ఆయన పాత్రను పరిచయం చేస్తారని చెబుతున్నారు. అయితే, దీనిపై చిత్ర టీమ్ నుంచి ఎలాంటి స్పష్టతా లేదు.

Vijay Leo movie Story line leaked jsp


 విజయ్‌ (Vijay) హీరో గా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లియో’(LEO) అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 19న  ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఇంట్రస్టింగ్ చర్చ  సోషల్ మీడియాలో  నడుస్తోంది. అలాగే 2005లో విడుదలైన హాలీవుడ్‌ ఫిల్మ్‌  A History of Violence (2005) ను స్ఫూర్తిగా తీసుకుని ‘లియో’ను తీర్చిదిద్దినట్లు వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది హాట్ టాపిక్ గా మారింది . అయితే రీసెంట్ గా  యూకేలో ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ‘లియో’కు పలు కట్స్‌ చెప్పడంతో నాలుగు నిమిషాల లెంగ్త్  తగ్గింది. ఈ క్రమంలోనే ప్లాట్‌లైన్‌ కూడా రివీల్‌ చేయటంతో కొంత క్లారిటీ వచ్చింది.

ఆ స్టోరీ  లైన్ ఏమిటంటే....‘చరిత్రలో అత్యంత క్రూరమైన హింసా సామ్రాజ్యంలో గడిపిన ఓ వ్యక్తి కొన్ని కారణాల వల్ల దాని నుంచి బయటకు వచ్చేస్తాడు. ప్రస్తుతం కెఫేను నడుపుకొంటూ కుటుంబంతో హాయిగా జీవిస్తున్న అతడి జీవితంలో కొందరు హంతకులు ప్రవేశిస్తారు. వాళ్ల రాకతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఇంతకీ లియోదాస్‌ గతంలో ఏం చేసేవాడు? ఆ హింసా సామ్రాజ్యం నుంచి ఎలా బయటపడ్డాడు? మళ్లీ కత్తిపట్టాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! అయితే A History of Violence (2005)  స్టోరీ లైన్ కూడా ఇదే కావటంతో  ఈ చిత్రం రీమేక్ అనే విషయంలో క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. 

మరోవైపు ఈ సినిమాలో రామ్‌చరణ్‌  గెస్ట్ రోల్ లో  నటిస్తారని టాక్‌ వినిపిస్తోంది. ‘విక్రమ్‌’లో రోలెక్స్‌లా ‘కోబ్రా’ పేరుతో ఆయన పాత్రను పరిచయం చేస్తారని చెబుతున్నారు. అయితే, దీనిపై చిత్ర టీమ్ నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. నిజంగా ఈ సినిమాలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారా? లేదా? తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఇక తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది ‘లియో’.  తమిళంలో ఈ సినిమాను ఐమ్యాక్స్‌ వెర్షన్‌లోనూ విడుదల చేస్తున్నారు. 

 ఈ చిత్ర తెలుగు ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను హైద‌రాబాద్‌​లో గ్రాండ్​గా నిర్వహించడానికి మేక‌ర్స్ ప్లాన్​ చేస్తున్నారని స‌మాచారం. ఈ వేడుక‌కు దళపతి విజయ్ రావట్లేదని.. చీఫ్ గెస్ట్‌లుగా లోకేష్ కనగరాజ్, అనిరుధ్‌లతో పాటు చిత్ర‌బృందం పాల్గోనుందని టాక్. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుధ్ లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఉండే అవకాశం ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్తలు వ‌స్తున్నాయి. కాగా దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్‌ దత్‌ ఆంటోనీ దాస్‌ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. యాక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతోన్న లియో అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios