విజయ్ 'లియో' మూవీ ఆ హాలీవుడ్ చిత్రానికి కాపీనా.. లోకేష్ కనకరాజ్ స్టోరీ మొత్తం లేపేశాడా ?
ఇళయదళపతి విజయ్ గత దశాబ్దంలో తమిళ నాట అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు. ప్రస్తుతం విజయ్..లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇళయదళపతి విజయ్ గత దశాబ్దంలో తమిళ నాట అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు. ప్రస్తుతం విజయ్..లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ లాంటి భారీ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో లియోపై తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అయితే విజయ్ ఫ్యాన్స్ ట్రైలర్ పై పూర్తి సంతృప్తిగా లేరనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ట్రైలర్ మొత్తం యాక్షన్ ఉంది కానీ.. విజయ్ ఫ్యాన్స్ కోరుకునే ఎలివేషన్స్ ఆశించినస్థాయిలో లేవని అంటున్నారు.
చెన్నైలో లియో ట్రైలర్ ప్రదర్శించిన రోహిణి థియేటర్స్ ని కూడా అభిమానులు ధ్వంసం చేశారు. ఫ్యాన్స్ అసంతృప్తితోనే ఇలా చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా లియో చిత్రంపై మరో కాంట్రవర్సీ బిల్డ్ అవుతోంది. ఈ చిత్రానికి కాపీ మరకలు అంటుకుంటున్నాయి.
పోస్టర్ రిలీజ్ అయినప్పుడే కాపీ అంటూ కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కావడంతో లియో చిత్రం హాలీవుడ్ చిత్రానికి కాపీ అంటూ నెటిజన్లు, విజయ్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ హాలీవుడ్ చిత్రం పేరు 'ది హిస్టరీ ఆఫ్ వయొలెన్స్'.
2005లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం గా నిలిచింది. ఒక కామన్ మ్యాన్ రౌడీలని అనుకోకుండా హత్య చేస్తాడు. దీనితో మాఫియా అతడు గ్యాంగ్ స్టర్ అనుకుని అతడి వెంట పడుతుంటారు. దాదాపు ఇలాంటి అంశాలనే లియో ట్రైలర్ లో కూడా కనిపిస్తున్నాయి. దీనితో లియో చిత్రం ప్రీమేక్ అంటూ విమర్శలు మొదలయ్యాయి. లోకేష్ కనకరాజ్ ఆ చిత్రం నుంచి ఇన్స్పైర్ అయ్యారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.