లియో ఆడియో వేడుక రద్దు... రాజకీయ కక్ష సాధింపే అంటున్న ఫ్యాన్స్!
హీరో విజయ్ లేటెస్ట్ మూవీ లియో ఆడియో వేడుక గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే దీని వెనుక రాజకీయ కోణం ఉందన్న వాదన వినిపిస్తోంది .

లియో మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ క్రమంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 30న చెన్నై వేదికగా ఆడియో, ట్రైలర్ లాంచ్ జరగాల్సి ఉంది. ఫ్యాన్స్ ఈ వేడుక కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అనూహ్యంగా లియో ఆడియో రిలీజ్ వేడుక రద్దు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. అంచనాలకు మించి అభిమానుల నుండి స్పందన రావడం. పాసుల కోసం విపరీతమైన రిక్వెస్ట్స్ రావడంతో... భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఈవెంట్ రద్దు చేస్తున్నామని వివరణ ఇచ్చారు.
అయితే అభిమానులు దీనిలో రాజకీయ కోణం ఉంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఉద్దేశపూర్వకంగా లియో ఆడియో రద్దయ్యేలా చేశాడు. విజయ్ సినిమాను తమిళనాడు ప్రభుత్వం తొక్కేస్తుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. కొన్నాళ్లుగా విజయ్ రాజకీయ ప్రవేశం చేసేందుకు పావులు కదుపుతున్నారు. అభిమానులతో సమావేశం అవుతున్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ బరిలో దిగడం ఖాయం అంటున్నారు.
లియో సినిమాపై ఆంక్షలు విధించడం వెనుక కారణం ఇదే అంటున్నారు. ఇక లియో చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఆయన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా లియో తెరకెక్కింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.