కన్నడ రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేసి అధికారాన్ని అందుకున్న జేడీఎస్ అధినేత కర్ణాటక సీఎం కుమారస్వామి సినిమా ఫీల్డ్ లో కూడా మళ్ళీ తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు. కొడుకు నిఖిల్ గౌడ ను హీరోగా పరిచయం చేస్తూ 2016 లో జాగ్వార్ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టి చేసిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 

అయితే ఇప్పుడు మరో సోషల్ మెస్సేజ్ కథను కొడుకుకు సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించనున్నాడు. నితిన్ తో గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాతో మెప్పించిన విజయ్ ఆ తరువాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం అనే సినిమా చేశాడు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్టవ్వలేదు. 

గత కొంత కాలంగా స్క్రిప్ పనుల్లో బిజీగా ఉన్న విజయ్ కుమార్ కు సడన్ గా సీఎం కుమార స్వామి నుంచి అఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ గౌడ రెండు కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు అయిపోగానే విజయ్ ప్రాజెక్టును కుమార స్వామి స్టార్ట్ చేయించనున్నట్లు సమాచారం.