Asianet News TeluguAsianet News Telugu

సర్ ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ.. VD13 సగం షూటింగ్ పూర్తి.. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్

రౌడీ హీరో తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. రీసెంట్ గా ‘ఖుషీ’తో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ అదే ఊపులో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను పూర్తి చేస్తున్నారు. తాజాగా VD13పై అదిరిపోయే అప్డేట్ అందించారు. 
 

Vijay Deverakondas VD13 Movie Shooting Update NSK
Author
First Published Sep 27, 2023, 11:55 AM IST

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  గత నాలుగైదు చిత్రాలతో వరుస ఫ్లాప్స్ ను అందుకుంటూ వచ్చారు. ఎట్టకేళలకు రీసెంట్ గా విడుదలైన ‘ఖుషీ’తో హిట్ టాక్ దక్కించుకున్నారు. విజయ్ - సమంత జోడీగా నటించగా.. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అందించిన జోష్ తో విజయ్ దేవరకొండ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ను త్వరగా పూర్తి చేస్తున్నారు. విజయ్ చేతిలో VD12, VD13 రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. 

తాజాగా VD13పై మేకర్స్ అప్డేట్స్ అందించారు. ‘గీతాగోవిందం’ కాంబినేషన్ రిలీజ్ చేస్తూ VD13 చిత్రం రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు పరుశురామ్ పెట్లతో మరోసారి విజయ్ దేవరకొండ వర్క్ చేస్తున్నారు. క్రేజీ సబ్జెక్ట్ తో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై 54వ చిత్రంగా నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రంపై అదిరిపోయే అప్డేట్ అందించారు. ఇటీవలనే లోకేషన్ల వేటలో కనిపించిన యూనిట్.. షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్నట్టు తెలియజేశారు.

‘వీడీ 13’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు శిరీష్ లు నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. వీడీ 13 నుంచి షూటింగ్ ప్రోగ్రెస్ ను మేకర్స్ ఇవాళ వెల్లడించారు. ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని వారు తెలపడం విశేషం. వచ్చే సంక్రాంతికి సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. ఇక త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నానమి తెలిపారు. 

గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ VD12 పనులూ అంతే వేగంగా జరుగుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు రౌడీ లైనప్ లో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios