`ఖుషి` చిత్ర షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, సమంతకి గాయాలయ్యాయి. చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్టు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న `ఖుషి` మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ఇది కాశ్మీర్ లో మొదటిషెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, సమంతల మధ్య లవ్ ఎపిసోడ్స్ లు, ఎమోషనల్ సీన్లు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి కావడంతో హైదరాబాద్ చేరుకుంది `ఖుషి` టీమ్. చిన్నగ్యాప్‌తో మరో షెడ్యూల్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. త్వరలోనే హైదరాబాద్ మొదలవుతుంది. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, సమంతకి గాయాలయ్యాయి. చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్టు తెలుస్తుంది. కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో వారికి గాయాలైనట్టు సమాచారం. షూటింగ్ చేస్తుండగా, వీరిద్దరు లిడర్ నదికిరెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడపవలసి వచ్చిందట. కానీ దురదృష్టవశాత్తు వాహనం నీటిలో పడిపోవడంతో విజయ్, సమంతకి గాయాలయ్యాయని తెలుస్తుంది. వెంటనే స్పందించిన టీమ్ స్థానిక ఆసుపత్రికి వీరిని తరలించి చికిత్స అందించారట.
అయితే గాయాలు స్వల్పంగానే కావడంతో దీన్ని బయటకు రానివ్వలేదని, హీరోహీరోయిన్లు కూడా వాటిని లైట్ తీసుకున్నట్టు సమాచారం.ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.కానీ విజయ్, సమంతకి ప్రమాదం అనే వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ ‘ఖుషి’తో వస్తోన్నసినిమా కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరింత ఆకట్టుకుంటుంది. సినిమాని తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు.ఈ ఏడాది డిసెంబర్ 23న `ఖుషీ` చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాతోపాటు విజయ్ `లైగర్`లో నటించగా, ఇది ఆగస్ట్ లో విడుదల కాబోతుంది. మరోవైపు పూరీ జగన్నాథ్‌తోనే `జనగణమన` చిత్రంలో నటించాల్సి ఉంది. ఇక సమంత సైతం బిజీగాఉంది. ఆమె `యశోద`, `శాకుంతలం` చిత్రాలను పూర్తి చేసుకుంది. అవి విడుదలకు రెడీ అవుతున్నాయి. మరోవైపు ఓ ఇంటర్నేషన్ ఫిల్మ్ లో, అలాగే ఓ బైలింగ్వల్ ఫిల్మ్ చేస్తుంది సమంత.
