తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికిన సినిమా అర్జున్‌ రెడ్డి. బోల్డ్‌ కంటెంట్‌తో సంచలన విజయం సాదించిన ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేసారు. విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలన్ని అర్జున్ రెడ్డితోటే పోల్చి చూడటం...ఆడకపోవటం కూడా జరిగింది. అయితే తనకు అంత సెన్సేషన్ హిట్ ఇచ్చిన అర్జున్ రెడ్డి ని మాత్రం దేవరకొండ తరం కావటం లేదు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆ దర్శకుడు సందీప్ వంగాకు ఓ రిక్వెస్ట్ చేసాడు.

విజయ్ దేవరకొండ ఆ దర్శకుడుని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ..... ఈ లాక్ డౌన్ పీరియడ్ లో రెండు నుంచి మూడు స్క్రిప్టులు పూర్తి చేయ్యి..నేను రెండేళ్ల దాకా షూటింగ్ కోసం వెయిట్ చెయ్యలేను అన్నారు. విజయ్ దేవరకొండ,సందీప్ వంగా కాంబినేషన్ కనుక రిపీట్ అయితే బిజినెస్ ఓ రేంజిలో ఉంటుంది. ఎక్సపెక్టేషన్స్ ఊహించటం కష్టం. అయితే ప్రస్తుతం సందీప్ వంగా...ఓ హిందీ సినిమా ప్లానింగ్ లో ఉన్నారు. 

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించాడు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా థియేటర్‌ దగ్గర బోల్తా పడినప్పటికీ అతడి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.  ప్రస్తుతం ఈ హీరో.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. 

బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. చార్మీ, పూరి, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్యా పాండే  హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 40 రోజుల ముంబై షెడ్యూల్‌ను క్రిందటి నెలలో  పూర్తి చేశారు. లాక్ డౌన్ బ్రేక్‌ తర్వాత కొత్త షెడ్యూల్‌ను ప్రారంభిస్తారు. ఈ సినిమాలో విజయ్‌ లుక్‌ చాలా కొత్తగా ఉంటుందని టాక్‌.