విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘హీరో’ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మాళవికా మోహన్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకి  తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై డైరక్టర్. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్న ఈ చిత్రం.. చాలా రోజుల క్రితమే   షూటింగ్‌ మొదలైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. దీనిలో విజయ్‌ బైకర్‌గా సందడి చేయనున్నట్లు తెలిసింది. రూ.15 కోట్ల ఖర్చుతో కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. అయితే  ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయినట్లు మీడియాలో వచ్చింది. అయితే ఎందుకు ఆగిపోయిందనే రకరకాల వార్తలు వినపడుతున్నాయి.  

ముఖ్యంగా స్క్రిప్టు విషయంలో విజయ్‌, ఆనంద్‌కు భిన్నాభిప్రాయాలు ఏర్పడటంతో  షూటింగ్ ను ఆపినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్‌ సలహాలు తీసుకోవడం ఆనంద్‌కు నచ్చలేదని కూడా చెబుతున్నారు. అంతేకాదు మైత్రి మూవీ మేకర్స్‌ కూడా అవుట్‌పుట్‌ విషయంలో సంతృప్తికరంగా లేరట. అందుకే ఇప్పటి వరకు రూ.15 కోట్లు ఖర్చు చేసినప్పటికీ రాజీపడకూడదని షూటింగ్ ను ఆపినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్లల్లో ఏమాత్రం నిజం ఉందో తెలియాలంటే.. విజయ్‌, మైత్రి సంస్థ స్పందించాల్సిందే.

డియర్ కామ్రేడ్ రిలీజ్, ప్రమోషన్ హడావిడిలో ఉన్న నిర్మాతలు, దర్శకుడు కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా విషయమై చర్చించి డెసిషన్ తీసుకుంటారని తెలుస్తోంది. ఆ డైరక్టర్ ని వద్దనుకుని, ఇప్పటిదాకా తీసిన అవుట్ ఫుట్ లోపనికొచ్చిదిచూసుకుని, మిగతాది వదిలేసి వేరే వారితో మొదలెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.