విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ ఆ మధ్యన అనసూయ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లు సోషల్ మీడియాలో ఎలా దుమారం రేపాయో తెలిసిందే. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయ అన్నట్లుగా యుద్ధం సాగింది.
విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ ఆ మధ్యన అనసూయ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లు సోషల్ మీడియాలో ఎలా దుమారం రేపాయో తెలిసిందే. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయ అన్నట్లుగా యుద్ధం సాగింది. అర్జున్ రెడ్డి చిత్రం రిలీజైనప్పటి నుంచి ఏదో విధంగా అనసూయ విజయ్ ని టార్గెట్ చేస్తోంది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో పూర్తిగా క్లారిటీ లేదు.
తరచుగా అనసూయ.. విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసే ట్వీట్స్ పై అతడి ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యే వాళ్ళు. దీనితో అనసూయ కూడానా ట్రోలింగ్ ఎదుర్కొంది. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ ఈ వివాదంపై స్పందించాడు. ఖుషి చిత్ర ట్రైలర్ లాంచ్ లో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహిచింది.
ఈ ప్రెస్ మీట్ లో ఓ మీడియా ప్రతినిధి అనసూయతో అసలు వివాదం ఏంటి.. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అని ప్రశ్నించారు. దీనికి విజయ్ దేవరకొండ సమాధానం ఇస్తూ.. ఏమో మీరు గొడవ పడే వాళ్లేనా అడగాలి. సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో నాకు తెలియదు అంటూ సింపుల్ గా ఆన్సర్ ఇచ్చాడు. పరోక్షంగా అనసూయనే అడగండి అని చెప్పాడు.
ఇక విజయ్ తన ప్రేమ పెళ్లి గురించి కూడా రియాక్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి దొరకాలి కదా. ఇంకా దొరకలేదు. మరో రెండు మూడు ఏళ్లలో పెళ్లి చేసుకుంటా అని విజయ్ సమాధానం ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం ఇదే. దీనితో విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఖుషి ట్రైలర్ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
