విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం `ఖుషి` సినిమాలో నటిస్తున్నారు. మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టారు. అవి త్వరలో ప్రారంభం కానున్నాయి. కొత్తగా మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతూ బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పటికే రెండు ప్రాజెక్ట్ లను అధికారికంగా ప్రకటించగా, మరికొన్ని చర్చలతో దశలో ఉన్నాయి. అందులో ఓ సినిమా ఫైనల్‌ అయ్యిందట. తనకు `టాక్సీవాలా` సినిమా ఇచ్చిన దర్శకుడు రాహుల్‌ సాంక్రిత్యాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. రాహుల్‌ చివరగా నానితో `శ్యామ్‌ సింగరాయ్‌` సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. కమర్షియల్‌గా యావరేజ్‌గా నిలిచింది. 

ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. `టాక్సీవాలా` తర్వాత విజయ్‌, రాహుల్‌ కలిసి పనిచేయబోతున్నారు. ఇది రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందట. పీరియాడికల్‌ డ్రామాగా ఈ సినిమా సాగుతుందని, ఇందులో విజయ్‌ దేవరకొండ ఓ యూత్‌ లీడర్‌ తరహా పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఆయన పాత్ర చాలా పవర్‌ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించే అవకాశాలున్నాయి. 

ఇక ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ `ఖుషి` సినిమాలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తుంది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది. దీంతోపాటు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో `వీడీ12` పేరుతో ఓసినిమా చేస్తున్నారు విజయ్‌. ఇందులో శ్రీలీలా కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్‌టైనర్మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్ట్ కానుంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ వివాదం హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

దీంతోపాటు పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ. పరశురామ్‌ మార్క్ ఎమోషన్స్, సెన్సిబులిటీస్‌ మేళవింపుగా ఉంటుందని సమాచారం. ఈ సినిమా ప్రారంభానికి ఇంకాస్త టైమ్‌ పడుతుంది. అనంతరం రాహుల్‌ సాంక్రిత్యాన్‌ మూవీ స్టార్ట్ కానుందట. ఇదిలా ఉంటే సుకుమార్‌ తో విజయ్‌ దేవరకొండ ఓ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఉండకపోవచ్చు అని సమాచారం.