విజయ్ దేవరకొండ, సమంతా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. 


సాధారణంగా ఓ పెద్ద డిజాస్టర్ సినిమా వస్తే..అదే హీరో తదుపరి చిత్రం బిజినెస్ పై ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఖుషీ చిత్రం లో హీరోగా చేస్తున్న విజయ్ దేవరకొండకు గత చిత్రం లైగర్ డిజాస్టర్, అలాగే సమంత గత చిత్రం శాకుంతలం డిజాస్టర్, ఈ చిత్రం దర్శకుడు శివ నిర్వాణ గత చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈ ముగ్గరు డిజాస్టర్స్ ఇచ్చిన కాంబినేషన్. దాంతో వీరి తాజా చిత్రం బిజినెస్ పై ఆ ఇంపాక్ట్ పడనుందా? 

 విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ(Shiva Nirvana) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన కొన్ని పాటలు, ట్రైలర్ మెప్పిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఖుషి సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సూపర్ హిట్స్ అందుకున్న ఈ డైరెక్టర్.. మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తూండంతో బిజినెస్ మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. 

View post on Instagram

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ‘ఆరాధ్య’, ‘నా రోజా నువ్వే’ పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.యూట్యూబ్‌లోనూ మిలియన్స్‌లో వ్యూస్ సంపాదించాయి. దీంతో ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచింది చిత్ర యూనిట్. ఈ నేపధ్యంలో అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని వినికిడి. శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కలిపి ఈ సినిమా కు భారీ ఎత్తున ఎంక్వైరీలు వస్తున్నాయి. నాన్ థియోటర్ రైట్స్ తో దాదాపు బడ్జెట్ మొత్తం రికవరీ అయ్యిందని వినికిడి. తెలుగు వెర్షన్ థియేటర్ బిజినెస్ దాదాపు 50 కోట్లు దాకా చేసిందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. 

ఇక ఖుషి చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆడియో లాంచ్ పేరుతో మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహిస్తున్నారు. ఖుషి సినిమా సాంగ్స్ ని లైవ్ లో పెర్ఫార్మ్ చేయబోతున్నారు. అలాగే విడుదల కానీ మరో రెండు పాటలని కూడా ఈ ఖుషి ఆడియో లాంచ్ లో రిలీజ్ చేస్తారని సమాచారం. ఖుషి ఆడియో లాంచ్ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ HICC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచారం, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్ కి విజయ్, సమంత అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఖుషి ఈవెంట్ ని స్పైరో ఈవెంట్స్ నిర్వహించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అనుబంధ సంస్థగా కొత్తగా ప్రారంభమైన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ స్పైరో ఈవెంట్స్. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ తోనే స్పైరో ఈవెంట్స్ టాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది.