`దేవర` డేట్‌ని టార్గెట్ చేసిన విజయ్ దేవరకొండ.. దిల్ రాజు ప్లాన్ చేస్తే ఇలా ఉంటది?
ఎన్టీఆర్ నటిస్తున్న `దేవర` మూవీ వాయిదా పడుతుందని ప్రచారం మొదలైంది. దీంతో అదే డేట్‌ని నిర్మాత దిల్ రాజు టార్గెట్ చేశారు. తన సినిమాని దించబోతున్నారు.
టాలీవుడ్‌లో చాలా సినిమాలు మంచి డేట్ కోసం చూస్తున్నాయి. చాలా మంది నిర్మాతలు ఏ డేట్‌ని రావాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల రిలీజ్ డేట్ చాలా కీలకంగా మారుతున్నాయి. కొన్ని డేట్లు సినిమా ఫలితాలనే తారుమారు చేస్తున్నారు. బాలేని సినిమాలు కూడా మంచి వసూళ్లు వచ్చేలా కొన్ని డేట్లు చేస్తున్నాయి. మరికొన్ని బాగున్నా సినిమా కూడా ఆడలేని పరిస్థితి నెలకొంది. అందుకే నిర్మాతలు తమ సినిమాలను ఆచితూచి రిలీజ్ చేస్తున్నారు.
దీంతో టాలీవుడ్‌లో కొన్ని కీలకమైన డేట్లకు తీవ్రమైన పోటీ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద సినిమాల్లో ఈ పోటీ ఉంది. నిర్మాతలు ఆ డేట్‌కి పట్టుపడి వస్తున్నారు. సంక్రాంతికి అదే జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న కూడా అదే జరుగుతుంది. నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. నెక్ట్స్ ఇప్పుడు ఏప్రిల్ దానికి వేదిక కాబోతుంది. ఏప్రిల్ 5న ఎన్టీఆర్ `దేవర` విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ ఇప్పుడు వాయిదా పడబోతుంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి కాని నేపథ్యంలో దీన్ని వాయిదా వేస్తున్నారట.
దీనికితోడు ఏపీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు కూడా ఈ మూవీ వాయిదాకి కారణమని తెలుస్తుంది. ఆగస్ట్ 15న విడుదల చేసే ఆలోచనలో నిర్మాత కళ్యా్ రామ్ ఉన్నారట. ఆ రోజు రిలీజ్ కావాల్సిన `పుష్ప2` వాయిదా పడుతుందని, అది డిసెంబర్‌కి వెళ్తుందని సమాచారం. దీంతో `దేవర` డేట్‌ని టార్గెట్ చేస్తున్నారు ఇతర హీరోలు. అందులో విజయ్ దేవరకొండ ముందున్నారు. ఆయన నటించిన `ఫ్యామిలీ స్టార్` మూవీ సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు నిర్మాత దిల్ రాజు. సమ్మర్‌లో రిలీజ్ చేయాలని భావించారు. ఇప్పుడు `దేవర` వాయిదా పడుతున్న నేపథ్యంలో ఆ రోజున విజయ్ దేవరకొండ నటిస్తున్న `ఫ్యామిలీ స్టార్`ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.
నిర్మాత దిల్‌రాజు ఇప్పుడు ఈ మూవీని ఏప్రిల్ 5న విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. దిల్‌రాజు ప్లాన్ చేస్తే అది మామూలుగా ఉండదు, ఇప్పుడు ఈ డేట్ విజయ్ సినిమాకి బాగా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. సినిమా బాగుంటే గట్టిగా కొట్టొచ్చు అనేది ఈ బడా నిర్మాత ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.
దీంతోపాటు అదే రోజు `టిల్లు స్వ్కైర్` కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. లేదంటే ఓ వారం ముందు అయినా వస్తుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న `ఫ్యామిలీ స్టార్`లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. `టిల్లు స్వ్కైర్`లో సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లో తెరకెక్కుతుంది.
Read more: `దేవర`, `పుష్ప2` వాయిదా..? కొత్త డేట్లు.. టిల్లుగాడు వచ్చేది కూడా అప్పుడే? మొత్తం గందరగోళం..