"సంక్రాంతికే రావాలా ఏంటి..?" ఇదేం కొత్త ట్విస్ట్
మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, రవితేజ డేగ, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు 2024 సంక్రాంతి రేసులో ఉన్నాయి.

సరైన సక్సెస్ కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు తన 13వ చిత్రం 'ఫ్యామిలీ స్టార్' పై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. తనతో గీతా గోవిదం వంటి వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురాంతో చేస్తూండటంతో ఆ లెక్కే వేరు అన్నట్లుంది. డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ లోనూ వీళ్లిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయింది. త్వరలోనే మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసి.. సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేసారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సినిమా కావడంతో హాలిడే సీజన్‌ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. కానీ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా సంక్రాంతికి వచ్చేలా కనపడటం లేదు. పెండింగ్‌లో ఉన్న షూట్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో, ఫ్యామిలీ స్టార్‌ని సంక్రాంతికి విడుదల చేయడం చాలా కష్టమని తెలుస్తోంది. దాంతో దర్శక,నిర్మాతలు సంక్రాంతి రిలీజ్ ప్లాన్ ను విరమించుకున్నట్లు సమాచారం. ఫ్యామిలీ స్టార్ ని 2024 ఫస్ట్ క్వార్టర్ లో విడుదల చేయనున్నారు. విజయ్ దేవరకొండ కూడా తిరిగి బౌన్స్ అవ్వడానికి సాలిడ్ హిట్ కావాలి దాంతో అతను కూడా తొందరపడ దలుచుకోలేదు. ఇదే విషయాన్ని దిల్ రాజుకు తెలియజేసారని చెప్తున్నారు. దాంతో ఈ విషయాన్ని బయ్యర్లుకు చెప్పినట్లు వినికిడి.
సంక్రాంతికి సినిమాల హడావుడి నెలకొనడంతో ఓఫినింగ్స్, థియేటర్స్,ఓటిటి రేట్లు ఇలా ప్రతీ విషయంలోనూ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో విడుదలను వాయిదా వేయాలని చిత్ర టీమ్ నిర్ణయించుకుంది. ఫ్యామిలీ స్టార్ తదుపరి షెడ్యూల్ USAలో ప్రారంభమవుతుంది. డిసెంబర్ చివరి నాటికి షూటింగ్ పూర్తి కానుంది. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, రవితేజ డేగ, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు 2024 సంక్రాంతి రేసులో ఉన్నాయి.
విజయ్ దేవరకొండ - పరశురాం పెట్ల కలిసి చేస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.