Asianet News TeluguAsianet News Telugu

ఏం చేస్తాం..ఖండిస్తాం' విజయ్ దేవరకొండ అదే చేాశాడు

అదే సమయంలో ధర్డ్ వేవ్ విరుచుకుపడుతుందనే భయం థియోటర్స్ కు దెబ్బే. ఏది ఏమైనా రెండు నెలల్లో అంతా సర్దుకునే అవకాశం ఉంది. మరి ఇలాంటప్పుడు ఏ హీరో అయినా తన సినిమాని ఓటిటి వేదికపై డైరెక్ట్ గా విడుదల చేయాలనుకుంటారా? 

Vijay Deverakonda dismisses reports of Liger OTT release jsp
Author
Hyderabad, First Published Jun 22, 2021, 8:32 AM IST

 తెలంగాణాలో ఇప్పటికే పూర్తిగా అన్ లాక్ చేసారు. ఏపీలో వచ్చే నెలలో లాక్డౌన్ ఎత్తేసే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో సినిమాల రిలీజ్ లపై పడింది అందరి దృష్టి. రెండు చోట్లా అన్ లాక్ అయితే  థియేటర్లలో సినిమాలు విడుదలకు ఏ అడ్డంకి లేదు. కాకపోతే జనాలకు థైర్యం రావాలి. పరిస్థితులు ఇంకా కుదుటపడాలి. కేసులు నమోదు తగ్గాలి. అయితే అదే సమయంలో ధర్డ్ వేవ్ విరుచుకుపడుతుందనే భయం థియోటర్స్ కు దెబ్బే. ఏది ఏమైనా రెండు నెలల్లో అంతా సర్దుకునే అవకాశం ఉంది. మరి ఇలాంటప్పుడు ఏ హీరో అయినా తన సినిమాని ఓటిటి వేదికపై డైరెక్ట్ గా విడుదల చేయాలనుకుంటారా?. కానీ మీడియాలో వార్తలు వచ్చేస్తే ఏం చెయ్యాలి..ఖండిచాలి తప్పదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సైతం అదే చేసారు.

గత కొద్ది రోజులుగా విజయ్ నటించిన ‘లైగర్’ సినిమా విషయంలో ఓటీటి మాట వినిపిస్తోంది. 2020 జనవరిలలో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా కరోనా దెబ్బతో డిలే అవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాతలు ఓ పెద్ద ఓటీటి కంపెనీతో డైరక్ట్ రిలీజ్ కు మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. డిజిటల్, శాటిలైట్,డైరక్ట్ ఓటిటి నిమిత్తం 200 కోట్లు ఆఫర్ చేసారని,నిర్మాతలు ఓకే అన్నారని ఆ వార్తల సారాంశం. ఈ విషయమై విజయ్ దేవరకొండ స్పందించారు. తమ సినిమా డైరక్ట్ ఓటిటి రిలీజ్ ఉండదని ప్రకటించాడు. థియోటర్స్ లో అంతకు మించిన బిజినెస్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసాడు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్'   దాదాపు ముప్పై శాతం షూటింగ్ పెండింగ్ ఉంది. దాన్ని పూరి జగన్నాథ్ జెట్ స్పీడులో పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత మిగతా పనులు పూర్తి చేసి  రిలీజ్ పెట్టుకోబోతున్నారు.  అయితే రిలీజ్ డేట్ విషయమై కరణ్ జోహార్ డెసిషన్ కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఇండియా మొత్తం ఒకే సారి రిలీజ్ కానుంది. 

విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చాలా ఫిట్ గా కనిపించనున్నారు. అందుకోసం జిమ్‌లో క‌స‌ర‌త్తులు  చేసాడు. ఈ సినిమాకు 'సాలా క్రాస్ బ్రీడ్' అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమా కోసం థాయ్ లాండ్ లో మార్షల్ ఆర్ట్స్ పై విజయ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. 

పూరితో పాటు చార్మి, కరణ్ జొహార్ లు ఈ సినిమాను నిర్మిస్తుండటంతో, ఇది క్రేజీ ప్రాజెక్టుగా మారింది. 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ కావడంతో, తదుపరి సినిమాతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్న విజయ్ దేవరకొండ, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాడని ఫస్ట్ లుక్ చూస్తుంటేనే తెలిసిపోతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios