లాక్ డౌన్ టైమ్ లో స్టార్స్ ఏం చేస్తూంటారు..ఇళ్లల్లోనే అలా ఖాలీగా కూర్చుని ఉంటారా..లేక ఏదన్నా పనుల్లో పడతారా...తమ తదుపరి సినిమాల కోసం స్క్రిప్టులు వింటారా...లేక టైమ్ వచ్చినప్పుడు చూసుకుందాములే అని లైట్ తీసుకుంటున్నారా..ఇవన్నీ సగటు అభిమానిలో కలిగే ప్రశ్నలు. ముఖ్యంగా యంగ్ హీరోల అభిమానులైన యూత్ లో ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాక్ డౌన్ టైమ్ లో వాళ్లు చేసేదేమీ లేదు కాబట్టి. షూటింగ్ లు ఏమీ లేని విజయ్ దేవరకొండ ఈ టైమ్ లో ఏం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు విజయ్ దేవరకొండ ఫిల్మ్ నగర్ లో కొన్న తన కొత్త భవంతికి ఇంటీరియర్ డెకరేషన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా  గృహాప్రవేశం కూడా చేసుకున్న విజయ్‌ ఇప్పుడు తమ ఇంటిని చక్కదిద్దే పనిలో ఉంటూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో  టైం దొరకడంతో తానే దగ్గర్నుండీ ది బెస్ట్‌ డిజైన్స్‌ ను సెలె క్ట్‌ చేసుకుని ఇంటికి ఇంటీరియర్‌ వర్క్‌ చేయిస్తున్నట్లు వినపడుతోంది. తన అభిరుచితోపాటు తల్లిదండ్రుల టేస్ట్‌కు తగ్గట్టుగా పలు డిజైన్లతో ఇంటిని తీర్చిదిద్దే వర్క్‌లో నిమగ్నమయి వున్నాడంటున్నారు.

‘పెళ్లి చూపులు’ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. అప్పటివరకూ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని విజయ్ దేవరకొండ.. ఆ చిత్రంతో తొలి సక్సెస్ అందుకొని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ హీరోగా ఓవర్ నైట్ ఎదిగిపోయాడు. ఈ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు విజయ్. ఆ తర్వాత తనదైన ఆటీట్యూడ్‌తో.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ..అద్బుతమైన నటనతో ఫాలోయింగ్ పెంచుకున్నారు.

 ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత వచ్చిన ‘మహానటి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలు కూడా అద్భుత విజయాన్ని సాధించటంతో పట్టుకున్నదల్లా బంగారమైంది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించకపోయినా.. యూత్‌లో మాత్రం విజయ్‌ దేవరకొండకు అంతే క్రేజ్ ఉంది.  ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ ..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రం చేస్తున్నారు.  శివనిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా, మైత్రీమూవీస్‌ సంస్థలో ఓ సినిమా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కమిట్‌ అయ్యాడు.