తెలుగు హీరోల్లో విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా  అర్జున్ రెడ్డి సక్సెస్ తో ఆ క్రేజ్ అమాంతం  రెట్టింపు అయ్యిపోయింది.  అయితే ఆ ఫాలోయింగ్ తో అభిమానులు చేసే కొన్ని పనులు విజయ్ కు ఇబ్బంది కలిగిస్తున్నాయి. దాంతో ఆయన క్షమాపణ చెప్పాల్సిన పరిస్దితి క్రియేట్ అయ్యింది. 

తన ఇమేజ్ తో  రౌడీ పేరుతో ఓ బ్రాండ్ ను మార్కెట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.   రౌడీ పేరుతో మార్కెట్లో దర్శనమిస్తున్న డ్రస్ లు యూత్ ని  విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.  అయితే రౌడీ బ్రాండ్ ను బైక్ నంబర్ ప్లేట్లపైకి కూడా ఎక్కిస్తున్న కొందరు కుర్రాళ్లు చట్ట రీత్యా చిక్కుల్లో పడుతున్నారు. 

బైక్ నంబర్ ప్లేట్ పై నంబర్ తో పాటు రౌడీ సింబల్ కూడా పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలాంటి బైక్ లను గుర్తించి ఫైన్ లు విధిస్తున్నారు. రీసెంట్ గా ఇద్దరు కుర్రోళ్లు బుల్లెట్ పై వెళుతున్నారు. ఆ బండికి నెంబర్ లేదు. రౌడీ అని రాసి ఉంది. వీళ్లు ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడ్డారు. వెంటనే ఆపారు. ఫైన్ వేశారు.  అంతేకాకుండా రౌడీ బండిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మీ నెంబర్ ప్లేట్ ను నిబంధనలకు అనుగుణంగా ఫిక్స్ చేసుకోవాలి.. అందుకు విరుద్ధంగా ఉంటే CMV Rule 50 & 51 కింద జరిమానా విధించటం జరుగుతుంది. దీనిపై ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తాం అని ప్రకటించారు.

ఈ విషయం తెలుసుకున్న హీరో.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పేజీలో రియాక్ట్ అయ్యారు.  విచారం వ్యక్తం చేశాడు. తన అభిమానుల తరఫున తాను క్షమాపణలు తెలుపుకుంటున్నానని తెలిపాడు. 

ఫ్యాన్స్ ను తాను కుటుంబ సభ్యులుగా భావిస్తానని, దయచేసి నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి కష్టాల్లో పడొద్దని హితవు పలికాడు. మీ ప్రేమను నంబర్ ప్లేట్లపై చూపించాల్సిన అవసరంలేదని, నంబర్ ప్లేట్లను నంబర్ కోసమే ఉపయోగించాలని సూచించాడు. హీరో విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.