Asianet News TeluguAsianet News Telugu

#Liger:‘లైగర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు (ఏరియా వైజ్)

 విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన మోస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'లైగర్‌' ఎట్టకేలకు గురువారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 పైగా థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. 

Vijay Deverakonda and Ananya Panday Liger first show collections
Author
First Published Aug 26, 2022, 10:42 AM IST

 

రౌడీహీరో విజయ్​దేవరకొండ నటించిన తాజా చిత్రం 'లైగర్'​. భారీ అంచనాలతో గురువారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే  ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో లేదని అందరూ పెదవి విరుస్తున్నారు. మార్నింగ్ షోకే ఈ సినిమాకు దారుణమైన టాక్ రావటంతో ఆ ఇంపాక్ట్ తర్వాత షోలపై పడింది  .దాంతో ఫస్టే డే   కలెక్షన్స్​ పరంగా కూడా నిరాశపరిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 13.35కోట్ల షేర్​, 24.5కోట్ల గ్రాస్​ అందుకుంది.

 లైగర్ టిక్కెట్ ధరల (Liger Ticket Rates) విషయానికి వస్తే.. తెలంగాణ: గరిష్ట టిక్కెట్ ధర GSTతో కలిపి.. మల్టీప్లెక్స్‌లు: 250, సింగిల్ స్క్రీన్‌లు: 175 రూపాయలు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అక్కడ గరిష్ట టిక్కెట్ ధర - GSTతో కలిపి.. మల్టీప్లెక్స్‌లు: 177, సింగిల్ స్క్రీన్‌లు: 147‌రూపాయలుగా ఉన్నాయి. 


తెలంగాణా  - 04.24cr

రాయలసీమ - 01.32cr

నెల్లూరు - 00.40cr 
(ఫిక్సెడ్ హైర్స్  - 00.12cr )

గుంటూరు - 00.83cr
( ఫిక్సెడ్ హైర్స్ - 00.31cr )

కృష్ణా - 00.48cr

వెస్ట్  - 00.39cr

ఈస్ట్  - 00.64cr

ఉత్తరాంధ్ర - 01.27cr

( కోస్తాంధ్ర + ఉత్తరాంధ్ర - 04.01cr )

రెండు తెలుగు రాష్ట్రాల తొలి రోజు టోటల్ థియేటర్ షేర్  - 09.57cr

రెండు తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ షేర్ - 62.00cr

రెండు తెలుగు రాష్ట్రాల తొలి రోజు టోటల్ థియేటర్ గ్రాస్ - 15.40cr
( ఫిక్సెడ్ హైర్స్ - 00.43cr )

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా- 00.55cr

మిగతా భాషలు - 00.22cr 

హిందీ బెల్ట్- 00.55cr

ఓవర్ సీస్  - 02.56cr

వరల్డ్ వైడ్  తొలి రోజు టోటల్ థియేటర్ - 13.45cr

వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ షేర్ - 90.00cr

వరల్డ్ వైడ్   తొలి రోజు టోటల్ థియేటర్ గ్రాస్  - 24.30cr
వరల్డ్ వైడ్ మొత్తం షేర్ - 13.4Cr 

  

 పాన్​ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్​. రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, విషు రెడ్డి, అలీ, దిగ్గజ బాక్సర్​ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషించారు. సునీల్‌ కశ్యప్‌, విక్రమ్‌ మాంట్రోస్‌, తనిష్‌ భాగ్చి సంగీతమందించారు. సినిమాటోగ్రఫీ- విష్ణు శర్మ, ఎడిటింగ్‌- జునైద్‌ సిద్ధిఖీ. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మూవీ విడుదలైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios