టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ సినీ వరల్డ్ లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. రీసెంట్ గా డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ స్టార్ చేసిన విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో చేస్తోన్న ఒక డిఫరెంట్ సినిమా షూటింగ్ తో బిజీ అయ్యాడు.  

అయితే ఈ సినిమాలో విజయ్ రైటర్ గా కనిపించబోతున్నట్లు రూమర్స్ వెలువడుతున్నాయి. కథలను వివిధ రకాల వేరియేషన్స్ తో అల్లుతూ సొంత కథలో తనకు తానే హీరోగా కనిపిస్తుంటాడట. తాను రాసిన కథలు చాలా గొప్పవని అందుకే తాను నటిస్తేనే గొప్పగా ఉంటుందని బిల్డప్ కొట్టే ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ లో విజయ్ నటించినట్లు తెలుస్తోంది.

ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ రూమర్ అయితే ఆడియెన్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఇక త్వరలో ఈ సినిమాకు సంబందించిన ఒక లుక్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.