బిగ్‌బాస్‌4 విన్నర్‌ అభిజిత్‌ తన ఫ్రెండ్‌ విజయ్‌ దేవరకొండని కలిశారు. బిగ్‌బాస్‌ ఫైనల్‌ పూర్తయి వారం రోజులవుతుంది. ఇన్ని రోజులు వరుస ఇంటర్వ్యూలతో సందడి చేసిన అభిజిత్‌ తన ఫ్రెండ్‌ని కలుసుకున్నాడు. తన ఆనందాన్ని పంచుకున్నాడు.  అనేక విషయాలను చర్చించుకున్నారు. కాసేపు సరదాగా గడిపారు. ఫుల్‌గా చిల్‌ అయినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోని అభిజిత్‌ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ ఇద్దరు కలిసి `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌లో అభిజిత్‌ ఉన్నప్పుడు అతన్ని సపోర్ట్ చేస్తూ విజయ్‌ సందేశాలిచ్చాడు. 

మరోవైపు విజయ్‌ దేవరకొండ వర్కౌట్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం విజయ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో `ఫైటర్‌` చిత్రంలో నటిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్‌. ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. ఇంకా ప్రారంభం కాలేదు. ఇక త్వరలోనే ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో బాడీని దృఢంగా మార్చుకునే పనిలో బిజీ అయ్యాడు రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ. జిమ్‌లో ట్రైనర్‌ సమక్షంలో కుస్తీ పడుతున్నారు. కండలు తిరిగిన దేహాన్ని పొందేందుకు శ్రమిస్తున్నాడు. 

ఈ సందర్భంగా దిగిన వీడియోని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు విజయ్‌. ప్రస్తుతం ఇది విశేషంగా అలరిస్తుంది. రౌడీ అభిమానులు తెగ వైరల్‌ చేస్తున్నారు. దీనిపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. `దట్స్‌ మై బాయ్‌, దట్స్ మై ఫైటర్‌..నువ్వు నన్ను గర్వపడేలా చేశావ్‌. లవ్యూ విజయ్‌` అని పేర్కొన్నాడు పూరీ.