టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి 
చేసుకుంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగరేణిలో పని చేసే ఉద్యోగిగా కనిపించనున్నాడు. కార్మికులకు యూనియర్ లీడర్ గా విజయ్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. 

అయితే కథ ప్రకారం సినిమాలో విజయ్ కి ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉంటాడని సమాచారం. అంటే విజయ్ తండ్రి పాత్రలో కనిపిస్తాడన్నమాట. ప్రేమకథా నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాశిఖన్నా, ఐశ్వర్యారాజేష్, క్యాతరిన్ వంటి హీరోయిన్లు కనిపించనున్నారు. 

గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. కెఎస్ రామారావుసినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.