వరుస విజయాలతో ఊపు మీదున్న విజయ్ దేవరకొండకు ఊహించని విధంగా నోటా కొంచెం దెబ్బకొట్టింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ నెక్స్ట్ సినిమా టాక్సీ వాలాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆలోచిస్తున్నాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ కామెడీ థ్రిల్లర్ గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. 

విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఇతర పనుల కారణంగా సినిమా మేకర్స్ టైమ్ తీసుకొని మంచి అవుట్ ఫుట్ ఇచ్చారట. ఫైనల్ గా సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. గీత ఆర్ట్స్ 2- యువీ క్రియేషన్స్ సపోర్ట్ తో సినిమాను భారీగా రిలీజ్ చేయనున్నారు. కొన్ని వారాలుగా రిలీజ్ డేట్ పై అనుమానాలు వచ్చాయి. 

ముందుగా నవంబర్ 16న సినిమాను విడుదల చేయాలనీ అనుకున్నారు. అదే రోజు రవితేజ అమర్ అక్బర్ అంథోని కూడా రానుంది. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో గాని విజయ్ వెనక్కి తగ్గాడు. ఒకేరోజు రెండు సినిమాలు విడుదలైతే కలెక్షన్స్ కి ఎఫెక్ట్ పడవచ్చని అందుకే టాక్సీ వాలా రిలీజ్ డేట్ వాయిదా పడిందని టాక్ వస్తోంది. ఇక రవితేజ టీమ్ కూడా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.  

ఫైనల్ గా నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా టాక్సీ వాలా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో విజయ్ మరికొన్ని రోజుల్లో సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ తో బిజీ కానున్నాడు. రాహుల్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది.