తమిళనాడులో ఖుషి జోరు... ఈ ఏడాదికి అరుదైన రికార్డు! 


విజయ్ దేవరకొండకు ఖుషి మిక్స్డ్ పలితాలు ఇచ్చింది. కొన్ని ఏరియాల్లో లాభాలు పంచిన ఈ చిత్రం మిగతా ఏరియాల్లో వెనుకబడింది. తమిళనాడులో మంచి వసూళ్లు రాబట్టింది. 
 

vijay devarakonda starer kushi rare record in tamilnadu ksr

విజయ్ దేవరకొండ-సమంతల రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఖుషికి మిశ్రమ స్పందన దక్కుతుంది. వీకెండ్ వరకూ సినిమా జోరు చూపించింది. మూడు రోజులకు వరల్డ్ వైడ్ రూ. 70 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే ఫస్ట్ మండే మూవీ తెలుగు రాష్ట్రాల్లో నెమ్మదించింది. ఓవర్సీస్లో వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. $1.5 మిలియన్ వసూళ్లను అధిగమించిన ఈ చిత్రం లాభాల్లోకి ఎంటర్ అయ్యింది. 

పాన్ ఇండియా మూవీగా ఖుషి పలు భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక తమిళనాడులో 2023కి గానూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఖుషి రికార్డులకు ఎక్కింది. రూ. 7 కోట్ల వసూళ్లు రాబట్టింది. నిర్మాతలు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. కోలీవుడ్ లో సమంతకు ఉన్న క్రేజ్ వర్క్ అవుట్ అయ్యింది. 

కాగా ఖుషి చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ కోటి రూపాయలు పేదలకు పంచనున్నట్లు వెల్లడించారు. ఖుషి హిట్ కొట్టిన నేపథ్యంలో  విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ఇంతటి విజయం అందించిన అభిమానులకు ఏదో ఒకటి చేయాలని ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వంద మందికి లక్ష రూపాయల చొప్పున ఒక కోటి రూపాయలు తన రెమ్యునరేషన్ నుండి పెంచుతున్నట్లు వెల్లడించారు. మాట నిలబెట్టుకుంటూ సోషల్ మీడియా వేదికగా అప్లికేషన్ లింక్ షేర్ చేశారు. 

లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ లో అడిగిన డిటైల్స్ పొందుపరిచి ఇబ్బందుల్లో ఉన్న వారు లక్ష రూపాయల కోసం అప్లై చేసుకోవచ్చు. వచ్చిన అప్లికేషన్స్ నుండి వంద మందిని ఎంపిక చేసి వారికి లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆ డబ్బులు ఉపయోగపడితే అంతకంటే ఆనందం లేదని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. ఇక ఖుషి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios