రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గ్యాప్  లేకుండా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. రెండేళ్ల వరకు మరో ప్రాజెక్ట్ ఒకే చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలల క్రితమే నాగ్ అశ్విన్ తో వర్క్ చేయడానికి విజయ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

మహానటి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న నాగ్ అశ్విన్ నెక్స్ట్ వైజయంతి ప్రొడక్షన్ లోనే మరో బిగ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కించనున్నట్లు ఎనౌన్స్ చేశాడు. అయితే ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా కొత్త నటీనటులతో, న్యూ జనరేషన్ టెక్నీషియన్స్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్న నాగ్ అశ్విన్ విజయ్ దేవరకొండ ను ఎప్పటిలానే సెంటి మెంట్ గా తన తదుపరి ప్రాజెక్ట్ లో జాయిన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 

నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ రిషి పాత్రలో నటించి ఒక్కసారిగా క్లిక్కయ్యాడు. ఇక నెక్స్ట్ మహానటిలో కూడా ఒక స్పెషల్ రోల్ లో కనిపించి మెప్పించాడు. ఇకపోతే ఇప్పుడు కూడా అలంటి తరహాలో దర్శకుడు కొత్త ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ ప్రభావం సినిమాలో గట్టిగానే కనిపించనున్నట్లు టాక్. లీడ్ రోల్ లో కనిపించనున్నాడా? లేకా స్పెషల్ క్యారెక్టరా? అనేది తెలియాల్సి ఉంది.