రష్మిక మందన్నపై అభిమానాన్ని మరోసారి బయటపెట్టాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. తాజాగా ఆమె గురించి విజయ్ పెట్టి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏమన్నాడంటే..?
చాలా కాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్య మధ్యలో వీరి గురించి రకరకాల ప్రచారం కూడా జరిగింది. త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. ఈనెలలోనే ఎంగేజ్మెంట్ అని కూడా అన్నారు. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉంది అనడానికి రకరకాల కారణాలు నెటిజన్ల కు కనిపించాయి. ఇక తాజాగా విజయ్ రష్మికపై వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
రష్మికపై అభిమానాన్ని మరోసారి వెల్లడించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆమెపై స్పెషల్ గా పోస్ట్ పెట్టాడు.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అన్నాడు. ఇంతకీ ఆమెపై ఇలా పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే.. రీసెంట్ గా రష్మిక ఓ ఘనత సాధించింది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది నేషనల్ క్రష్. ఈసందర్భంగానే రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. రష్మిక మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించాడు.

రష్మిక గురించి పోస్ట్ చేస్తూ.. ఈ విధంగా రాసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ పోస్ట్ పెట్టాడు. అటు నెటిజన్లు కూడా రష్మికను రకరకాలుగా విష్ చేస్తున్నారు. ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసిన 30 ఏళ్లలోపు యంగ్ స్టార్స్ లో ఫోర్బ్స్ పత్రిక.. ‘30 అండర్ 30’ జాబితాను రూపొందిస్తుంది. ఈ ఏడాది రష్మికతో పాటు మరో ముగ్గురు నటీమణులకు ఈ లిస్టులో చోటుదక్కింది. తనకు దక్కిన ఈ గుర్తింపుపై రష్మిక తొలిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
అంతే కాదు తన ఫోటోతో కూడిన మ్యాగజైన్ కవర్ ఫొటోను షేర్ చేసిన రష్మిక తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్టును విజయ్ దేవరకొండ కూడా షేర్ చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపాడు. రష్మిక, విజయ్ దేవరకొండ చాలా సందర్బాల్లో నెటిజన్లకు దొరికిపోయారు. ఇద్దరు ఒకే సమయంలో రౌడీ బ్రాండ్ డ్రస్సులు వేయడం.. మాల్దీవ్స్ ట్రిప్స్ కు ఇద్దరు వెళ్లి.. ఒకే లొకేషన్ నుంచి విడి విడిగా పోటోలు శేర్ చేయడంతో.. దొరికిపోయారు. ఇక ముంబ్ లో డిన్నర్ డేట్లు... లాంటివి కెమెరాల కంటి నుంచి తప్పించుకోలేకపోయారు ఇద్దరు స్టార్లు.
ఇక వీరికి ఎంగేజ్‌మెంట్ కానున్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఇటీవలే క్లారిటీ ఇచ్చిన రష్మిక.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ప్రతి రెండేళ్లకు ఓసారి మీడియాలో తన పెళ్లి వార్తలు వస్తుంటాయని వ్యాఖ్యానించింది. అలాగే.. ఏడాదికోసారి తన నిశ్చితార్థం వార్తలు వస్తాయని చమత్కరించింది.
