ఇప్పటికే చాలా లేట్ అయ్యింది.. ఇక వరుసగా సినిమాలు దించేయాలి అనకుంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. దాదాపు మూడేళ్లు గ్యాప్ రావడంతో నెక్ట్స్ సినిముల స్పీడ్ పెంచేస్తున్నాడు.  

ఇప్పటికే చాలా లేట్ అయ్యింది.. ఇక వరుసగా సినిమాలు దించేయాలి అనకుంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. దాదాపు మూడేళ్లు గ్యాప్ రావడంతో నెక్ట్స్ సినిముల స్పీడ్ పెంచేస్తున్నాడు. 

దాదాపు రెండేళ్ళు దాటింది విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి సినిమా వ‌చ్చి. ప్ర‌స్తుతం రౌడీ హీరో నటించిన లైగ‌ర్ రిలీజ్ కు రెడీగా ఉంది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కింది. అయితే కరోనా కారణంగా లైగర్ బాగా డిలే అయ్యింది. వేరే సినిమాలు కూడా చేయడానికి వీలులేకుండా పోయింది. దాంతో ఇక తగ్గేదే లే అంటున్నాడు రౌడీ హీరో. నెక్ట్స్ కమిట్ అయన సినిమాలను సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. 

లైగర్ తో పాటు మరో మూడు సినిమాలు చేయబోతున్నాడు విజయ్. మ‌రోసారి పూరీ ద‌ర్శ‌క‌త్వంలోనే జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాను చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియలం అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ప్ర‌స్తుతం లైగ‌ర్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఎక్కువ ఉండ‌టంతో జ‌న‌గ‌ణ‌మ‌న షూటింగ్ కాస్త లేట్‌గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 

అయితే ఈసినిమాలకంటే ముందే కమిట్ అయిన రెండు సినిమాలు చేయాల్సి ఉంది విజయ్. శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓసినిమా.. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా కమిట్ అయ్యాడు స్టార్ హీరొ. ముందుగా శివ నిర్వాణ సినిమాను ముందుకు తీస‌కురానున్నాడు.

నిజానికి శివ నిర్వాణ మ‌జిలీ త‌ర్వాత విజ‌య్‌తో సినిమా చేయాల్సిఉంది. అప్ప‌టికే విజ‌య్‌తో స్టోరీ ఫైన‌ల్ కూడా అయింది. కానీ విజ‌య్ లైగ‌ర్‌ లేట్ అవుతూ రావడం.. లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా లైగ‌ర్ పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్క‌నుండ‌టంతో విజ‌య్ పూర్తి ఫోక‌స్ అంతా లైగ‌ర్ పైనే పెట్టాడు.ఇప్పుడు లైగ‌ర్ షూటింగ్ పూర్తి కావ‌డంతో శివ నిర్వాణ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కింది. 

ఇక స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 23నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు టాక్‌. అయితే ఈసినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రెండ్ మార్క్ సినిమా ‘ఖుషి టైటిల్‌ ప‌రిశీల‌నలో ఉన్నట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్ట‌ర్‌గా నిలిచిన ఖుషి టైటిల్‌ను ఈ సినిమాకి పెట్టాలని అనుకుంటుండటంతో సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది. అటు ఆడియన్స్ లో కూడా ఈసినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమాలో విజ‌య్ ఆర్మీ అధికారిగా న‌టించ‌నుండ‌గా సమంత కాశ్మీరి అమ్మాయిగా న‌టించ‌నుంది.