టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆ క్రేజ్ ని చాలా కంపనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. విజయ్ దేవరకొండని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొని తమ కంపనీ ఉత్పత్తులను సేల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విజయ్ కొన్ని బ్రాండ్ లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో ఫ్యాషన్ బ్రాండ్ అతడి ఖాతాలోకి చేరింది.

అదే మేబాజ్ బట్టల బ్రాండ్. దీనికి విజయ్ తో పాటు కియారా అద్వానీ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. దీని యాడ్ షూట్ కోసం విజయ్ ముంబై వెళ్లాడు. అక్కడ ఈ జంటపై యాడ్ ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ జంటని చూసిన ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వీరి జంట చూడడానికి ముచ్చటగా ఉందని.. ఇద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలనుందంటూ తమ కోరికలను తెలియబరుస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించకపోయినా.. రీమేక్‌ల రూపంలో వీరి సినిమాలు వచ్చాయి. విజయ్ నటించిన 'అర్జు్న్‌రెడ్డి' సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్‌తో తెరకెక్కించారు.

ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించింది. మరి వచ్చే ఏడాదిలోనైనా వీరిద్దరూ కలిసి నటిస్తారేమో చూడాలి. ప్రస్తుతం విజయ్.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అలానే పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా.. కియారా బాలీవుడ్ లో 'లక్ష్మీ బాంబ్' అనే సినిమాలో నటిస్తోంది. అలానే ‘గుడ్ న్యూస్’, ‘షేర్‌షా’, ‘ఇందూ కీ జవానీ’ వంటి చిత్రాలలో నటిస్తోంది.