విజయ్ దేవరకొండకు తన స్పెషల్ డ్రెస్సింగ్ బ్రాండ్ “రౌడీ” ఉన్న సంగతి తెలిసిందే.  ఆ బ్రాండ్ నుంచి విజయ్ బన్నీకు గతంలోనే ఒక కలెక్షన్ ను పంపాడు. అలా ఇప్పుడు మరోసారి కొన్ని కూల్ డ్రెస్ కలెక్షన్ ను పంపాడు. దీనితో అవి వేసుకొని మరింత స్టైలిష్ లుక్ లో కనిపించి ఇలాంటి స్పెషల్ థింగ్స్ ను తనకు పంపినందుకు విజయ్ కు అలాగే తన రౌడీ బ్రాండ్ వారికి స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నానని బన్నీ స్పెషల్ థాంక్స్ చెప్పాడు. 

ఈ నేపధ్యంలో ఆ డ్రస్ వేసుకుని మరి సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసారు. ఆ రకంగా బన్ని అభిమానులు కూడా ఇప్పుడు రౌడీ బ్రాండ్ కు పూర్తిగా దగ్గర అవుతారు. ఇలా ఉచితంగా తన బ్రాండ్ కు బన్నిని బ్రాండ్ అంబాసిడర్ చేసేసాడని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి దేవరకొండపై. అయితే స్నేహం కొద్ది ఇలా బన్ని చేసారు. ధాంక్స్ మాత్రమే చెప్పాలనుకుంటే ఆయన ఫోన్ చేసి చెప్పచ్చు. కానీ కావాలనే ఇలా సోషల్ మీడియాలో ఆ డ్రస్ తో కనిపించి కనువిందు చేసారు బన్ని. 

ఇక   రౌడీ బ్రాండ్ అనే పేరుతో  విజయ్ దేవరకొండ క్లాజ్ బిజినెస్  చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రౌడీ బ్రాండ్‌కి సంబంధించిన స్పెషల్లీ డిజైనెడ్ క్లోత్స్‌ని త‌యారు చేపిస్తుంటారు. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండంతో సెల‌బ్రటీలు కూడా వీటిపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. గ‌తంలో విజ‌య్ తాను డిజైన్ చేసిన బ‌ట్ట‌ల‌కు అల్లు అర్జున్ కు బ‌హుమ‌తిగా పంపగా, వాటిని అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకు సంబంధించి వేడుక‌లో ధ‌రించాడు. 

ఇక తాజాగా మ‌రోసారి బ‌ట్ట‌లు పంపారు విజ‌య్. ఈ సంద‌ర్భంగా దేవ‌రకొండ‌తో పాటు రౌడీ క్ల‌బ్‌కు కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. నువ్వు పంపిన బ‌ట్ట‌లు చాలా కంఫోర్ట్‌గా ఉన్నాయి. నువ్వు చూపించే ఈ ప్రేమ‌కు నా ధ‌న్య‌వాదాలు అన్నీ బ‌న్నీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. అంతేకాకుండా ఆ బ‌ట్ట‌లు ధ‌రించి దిగిన ఫొటోల‌ని కూడా షేర్ చేశాడు. ఇక  విజ‌య్ దేవ‌ర‌కొండ ఫైట‌ర్ సినిమా చేస్తుంటే, అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు.