Asianet News Telugu

విజయ్ దేవరకొండ 'డియ‌ర్ కామ్రేడ్‌' కథ ఇదే..?

డియర్ కామ్రేడ్ అంటే మనకు ఇష్టమైన వాళ్ళను మనం డియర్ అని పిలుస్తాం. అలాగే కామ్రేడ్ అంటే మనం సాధించుకోవాల్సిన హక్కుల కోసం పోరాడటం. అలా అని ఈ సినిమాలో రాజకీయాలు, కమ్యూనిజం లాంటివి ఏమి ఉండవు.  

vijay devarakonda's dear comrade movie story line revealed
Author
Hyderabad, First Published Jul 24, 2019, 9:24 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌ తో వస్తున్న ఈ చిత్రానికి భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు. జూలై 26న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ అంటూ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్  లో వినపడుతోంది. 

ఈ సినిమా బేసిక్ గా  బాబీ(విజయ్ దేవరకొండ) అనే ఓ స్టూడెంట్ లీడర్ జర్నీ. అతనికి లిల్లీ(రష్మిక) అనే అమ్మాయి మధ్య జరిగే కథ. బాబి,లిల్లీలు ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లిలో  కలుస్తారు. అక్కడ సరదాగా క్రికెట్ ఆడతారు. విజయ్ గ్యాంగ్ అంతా అమ్మాయే కదా అని అండర్ ఎస్టిమేట్ వేస్తారు. కానీ అందరినీ సర్పైజ్ చేస్తూ తన స్కిల్స్ తో ఓ ఆటాడుకుంటుంది. తర్వాత ఆమె క్రికెట్ లో స్టేట్ ప్లేయర్ అని రివీల్ అవుతుంది. అక్కడ నుంచి వాళ్లిద్దరూ ప్రెండ్స్ అవుతారు. కొద్ది రోజులకు బాబి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అయితే తాను కెరీర్ పై కాన్సర్టేట్ చేయాలని రిజక్ట్ చేస్తుంది. ఇదంతా కాకినాడలో జరుగుతుంది. 

ఆ తర్వాత కథ హైదరాబాద్ కు షిప్ట్ అవుతుంది. అక్కడ మళ్లీ కలుస్తారు. ఈ సారి లిల్లీ అతనికి దగ్గరవుతుంది. ప్రేమలో పడుతుంది. కానీ బాబి యాటిట్యూడ్ ఆమెను డిస్ట్రబ్ చేస్తుంది. బాబిది మొదట నుంచి విప్లవ భావాలుతో ఉంటాడు. బాబీ తాతగారు కమ్యూనిస్ట్ నాయకుడు కాబట్టి.. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆ విప్లవ భావాలు ఎక్కువ. అన్యాయాన్ని సహించకపోవడం, తప్పులను ఎత్తిచూపడం అనేది అతని నైజం. సైలెంట్‌గా అస్సలు ఉండలేదు. కాలేజ్‌లో లీడర్‌గా ఉంటాడు.ఓ విషయంలో జరిగిన గొడవలో అతను హాస్పటిల్ పాలవుతాడు. అప్పటికే అతన్ని మారమని చెప్పి విసిగిపోయిన లిల్లీ ..బ్రేకప్ అంటుంది. ఇద్దరూ విడిపోతారు.

తర్వాత కొద్ది కాలానికి బాబికి ఓ కాల్ వస్తుంది. ఓ అమ్మాయి డిప్రెషన్ లో ఉందని. వెళ్లి చూస్తే లిల్లీ. ఆమెను కలిసి ఖచ్చితంగా క్యూర్ అవుతుందని హామీ ఇస్తాడు. ఆమె డిప్రెషన్ కు కారణం క్రికెట్ కోచ్ మిస్ బిహేవియర్ అని తెలుసుకుంటాడు.  ఆ దిశగా అతను ఫైట్ చేస్తాడు. అయితే లిల్లీ అతన్ని ఏక్సెప్ట్ చేయదు. పరిస్దితిలు వేరే రకంగా టర్న్ తీసుకుంటాయి. చివరకు వాళ్ల ప్రేమ ఏ విధంగా సక్సెస్ అయ్యిందనేది మిగతా సినిమా. ఇదీ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న కథ. ఇందులో నిజమెంత ఉంది అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.

ఇక డియర్ కామ్రేడ్  సినిమా మంచి ఎమోషనల్ ట్రీట్‌గా ఉంటుందని చెప్తున్నారు. సినిమా చూసాక తప్పకుండా ప్రేక్షకుడు ఆ ఎమోషన్‌ను ఇంటివరకు తీసుకెళతాడని నిర్మాతలు ధైర్యంగా ఉన్నారు. డియర్ కామ్రేడ్ అంటే మనకు ఇష్టమైన వాళ్ళను మనం డియర్ అని పిలుస్తాం. అలాగే కామ్రేడ్ అంటే మనం సాధించుకోవాల్సిన హక్కుల కోసం పోరాడటం. అలా అని ఈ సినిమాలో రాజకీయాలు, కమ్యూనిజం లాంటివి ఏమి ఉండవు.  

Follow Us:
Download App:
  • android
  • ios