ఈ థియేటర్. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ స్క్రీనింగ్‌తో AVD సినిమాస్ ప్రారంభంకానుందని అనుకున్నారు. కుదరలేదు. దాంతో ఇప్పుడు లవ్ స్టోరీ తో సినిమా మొదలు కానుందని తెలుస్తోంది. అంటే సెప్టెంబర్ 24న గ్రాండ్ గా లాంచ్ కాబోతోందన్నమాట. AVD అంటే ఏషియన్ విజయ్ దేవరకొండ.
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు మరో బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో క్లాతింగ్ వ్యాపారాన్ని విజయవంతంగా చేస్తున్న విజయ్.. తాజాగా మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలంగాణాలో నెంబర్ వన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసాడు విజయ్. మల్టీప్లెక్స్‌కు ఎవిడి సినిమాస్ అని పేరు పెట్టారు. ఇది విజయ్.. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ఏషియన్ సినిమాస్ మధ్య జాయింట్ వెంచర్‌గా వస్తోంది.
ఈ థియేటర్. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ స్క్రీనింగ్‌తో AVD సినిమాస్ ప్రారంభంకానుందని అనుకున్నారు. కుదరలేదు. దాంతో ఇప్పుడు లవ్ స్టోరీ తో సినిమా మొదలు కానుందని తెలుస్తోంది. అంటే సెప్టెంబర్ 24న గ్రాండ్ గా లాంచ్ కాబోతోందన్నమాట. AVD అంటే ఏషియన్ విజయ్ దేవరకొండ.
ఇక గతంలో ఏషియన్ సినిమాస్ తోనే కలసి మహేష్ బాబు ఆరంభించిన AMB సినిమాస్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్ తో ఓ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు. అమీర్ పేట సత్యం థియేటర్ ప్లేస్‌లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. లైగర్ పేరుతో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.
