యువ సంచలనం విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. మైత్రి నిర్మాణంలో తెరక్కుతున్న ఈ చిత్రంలో విజయ్, రష్మిక జంటగా నటించారు. మరోవైపు క్రాంతి మాధవ్ దర్శత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. 

ఇక మరో క్రేజీ డైరెక్టర్ విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. అతనెవరో కాదు.. 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్. ప్రస్తుతం విక్రమ్ కుమార్ నానితో గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే విజయ్ తో సినిమా పట్టాలెక్కించాలనేది అతడి ప్లాన్. అందుకోసం కథ కూడా సిద్ధం చేసుకున్నాడట. 

త్వరలో విజయ్ దేవరకొండని కలసి కథ వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తో సర్దార్, కాటమరాయుడు చిత్రాలు నిర్మించిన శరత్ మరార్ విక్రమ్ కుమార్ తో ఓ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.