మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ యంగ్ డైరెక్టర్ బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఒక లేడి ఓరియెంటెడ్ బయోపిక్ సినిమాకు చాలా కాలం తరువాత మంచి కలెక్షన్స్ దక్కాయి. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. 

మూడవసారి భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాలని అశ్విన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. వైజయంతి మూవీస్ కూడా అందుకు సిద్ధంగా ఉండడంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నట్లు టాక్. అసలు మ్యాటర్ లోకి వస్తే మొన్నటి వరకు స్క్రిప్ట్ ను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ ఇప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ ని విజయ్ దేవరకొండకు వినిపించినట్లు సమాచారం. 

విజయ్ ఇదివరకే ఈ దర్శకుడితో మహానటితో పాటు ఎవడే సుబ్రమణ్యం సినిమా కూడా చేశాడు. రెండు సినిమాలు విజయ్ కి మంచి క్రేజ్ ని అందించాయి. దీంతో మూడవ సినిమా ద్వారా ఇద్దరు బిగ్ స్టార్స్ గా మరో స్ట్రాంగ్ ప్రాజెక్ట్ ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రాజెక్ట్ కి సంబందించిన స్పెషల్ ఎనౌన్స్మెంట్ ని వైజయంతి మూవీస్ ప్రకటించనుంది.