టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండని ముద్దుల విషయంలో ఇమ్రాన్ హష్మితో పోలుస్తుంటారు. బాలీవుడ్ లో ఇమ్రాన్ మాదిరి తెలుగు సినిమాల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్లతో లిప్ లాక్ కానిచ్చేస్తుంటాడు. దాదాపు విజయ్ నటించిన అన్ని చిత్రాల్లో ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. 

తాజాగా ఆయన నటిస్తోన్న 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో లిప్ లాస్ సీన్ పెట్టి మరింత హైప్ తీసుకొచ్చారు. తాజాగా దర్శకుడు క్రాంతి మాధవ్ తో కలిసి మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఇందులో రాశిఖన్నాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. కథ డిమాండ్ చేయడంతో విజయ్-రాశిఖన్నాల మధ్య ఓ గాఢముద్దు సన్నివేశం ఉండబోతుందట.

అయితే ఆ లిప్ లాక్ సీన్ విజయ్ గత చిత్రాల మాదిరిగా కాకుండా కాస్త గాఢత ఎక్కువ ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ రేంజ్ లో రెండు మూడు నిమిషాల పాటు ఉండేలా ఈ ముద్దు సన్నివేశం ఉండబోతుందని అంటున్నారు. మరి ఈ సన్నివేశాలకు ఎంత క్రేజ్ వస్తుందో చూడాలి!