అగస్ట్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది పూరీ-విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లైగర్. ఇక ఇప్పటికీ ఈసినిమాను చెక్కుతూనే ఉన్నాడు డైరెక్టర్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడట. ఇంతకీ వారు ఎక్కడున్నారు.  

టాలీవుడ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ , రౌడీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ కాంబోలో వ‌స్తున్న సినిమా లైగ‌ర్. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో వ‌స్తున్న ఈ మూవీలో... విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ‌ అన‌న్య‌పాండే నటిస్తోంది. పక్కా ప్లానింగ్ తో పాన్ ఇండియాను టార్గేట్ చేసుకుని రూపొందుతోంది మూవీ. దానికి తగట్టే..పూరీ జగన్నాథ్ లైగన్ ను చాలా జాగ్రత్తగాచెక్కారు. ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. 

ముందుగా టాలీవుడ్ మూవీగా స్టార్ట్ అయిన ఈసినిమా.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ జాయిన్ అవ్వడంతో..ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా మారిపోయింది. ఇండియాలోని ముంబయ్, హైదరాబాద్ లతో పాటు.. హాలీవుడ్ లో కూడా షూటింగ్ చేసుకున్న ఈసినిమాలో వ‌ర‌ల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీ రోల్‌లో న‌టిస్తున్నాడు ఇక తాజాగా ఈ సినిమా అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ముంబైలో లైగ‌ర్ మూవీ షూటింగ్ జ‌రిగింది. 

ఈ షెడ్యూల్ లో.. మార్పుల్లో బాగంగా.. విజ‌య్‌, అన‌న్య‌పై వ‌చ్చే సాంగ్ షూట్ చేసిన‌ట్టు బీటౌన్ స‌ర్కిల్ టాక్‌. షూటింగ్ మ‌రిన్ని వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త ఇవ్వ‌నుంది పూరీ టీం. అయితే ఈ సాంగ్ ముందు నుంచీ అనుకున్నది కాదని.. సడెన్ గా ఈసాంగ్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు సమాచారం. 

మ‌ల్టీలింగ్యువ‌ల్ ప్రాజెక్టులో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో.. టీ అమ్ముకుని బ్రతివే పాత్రో... ర‌మ్య‌కృష్ణ కీ రోల్ చేస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా వ‌స్తున్న లైగ‌ర్‌ను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై అపూర్వ మెహ‌తా, క‌ర‌ణ్ జోహార్, ఛార్మీ కౌర్‌, పూరీ జ‌గ‌న్నాథ్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నారు. లైగ‌ర్‌లో . ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 25న తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ప్రపంచ వ్యాప్తంగా... థియేట‌ర్ల‌లోగ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది.