Asianet News TeluguAsianet News Telugu

ఖుషి' కలెక్షన్లకి....వాళ్లిద్దరూ పెద్ద దెబ్బ కొట్టారే

జవాన్ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేయటంతో,అందరూ ఆ సినిమా గురించే మాట్లాడటం జరుగుతోంది. దాంతో ఇప్పుడు ఖుషీ అనేది ప్రక్కకు వెళ్లిపోయింది. 

Vijay Devarakonda #Kushi has failed to show any growth jsp
Author
First Published Sep 8, 2023, 12:34 PM IST

 విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత రూత్ ప్రభు (Samantha) కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'ఖుషి' (Kushi Movie 2023) మొన్న శుక్రవారం భారీ ఎత్తున రిలీజైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో  ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.  సినిమా కు మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ వచ్చింది. దాంతో సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ భావించారు. అందుకు తగినట్లుగానే ఫస్ట్ వీకెండ్ అదరకొట్టింది. ఆ తర్వాత మెల్లిగా డ్రాప్ ప్రారంభమైంది. నైజాంలో మల్టిప్లెక్స్ లు, యుస్ లో అయితే లాభాలు బాట పట్టినట్లే.  బి,సి సెంటర్లలలో పెద్దగా వర్కవుట్ కావటం లేదని ట్రేడ్ అంటోంది. క్లాస్ ఫిల్మ్ కావటం అందుకు కారణంగా చెప్పారు. అయితే ఈ గురువారం జవాన్ రిలీజ్ అవ్వటం పెద్ద దెబ్బే కొట్టింది.

జవాన్ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేయటంతో,అందరూ ఆ సినిమా గురించే మాట్లాడటం జరుగుతోంది. దాంతో ఇప్పుడు ఖుషీ అనేది ప్రక్కకు వెళ్లిపోయింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవటంతో ... ఇక్కడ కూడా కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. మాస్ కు బాగా నచ్చేయటం కలిసొచ్చిన అంశం.  ఆంధ్రాలోనూ భారీ వసూళ్లు రాబట్టడమే అందుకు సాక్ష్యం. మరో ప్రక్క  మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీలు అటు వైపుకు మ్రొగ్గు చూపెడుతున్నారు. దాంతో  ఖుషి పికప్ ఇవ్వడం కష్టమే అనిపిస్తోంది.
ట్రేడ్ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్  అవ్వాలంటే ఇంకో 15 కోట్ల దాకా రావాలి. వచ్చే వారం అంటే  సెప్టెంబర్ 15న చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీలు వస్తున్నాయి.  
 
ఇవన్నీ ఇలా ఉంటే ...రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కూడా కలెక్షన్లు పడిపోవడానికి కారణంగా చెప్తున్నారు. మళ్లీ వీకెండ్ కు పుంజుకోకపోతే నైజాం, యూఎస్ఏలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఖుషీ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవంటున్నారు.   ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో ఖుషీ కలెక్షన్లు  దారుణమే అంటున్నారు. 
 
 మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు 'ఖుషి'లో నటించారు. ఈ చిత్రానికి పాటలు : శివ నిర్వాణ, పోరాటాలు : పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.
 

Follow Us:
Download App:
  • android
  • ios