టాలీవుడ్ సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్నాడు. 'గీత గోవిందం' చిత్రంతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ హీరో తన రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో విజయ్ దేవరకొండ.. నిర్మాత దిల్ రాజుకి చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. విజయ్ తో సినిమా చేయాలనుకున్న దిల్ రాజు అతడిని సంప్రదించగా.. దానికి విజయ్ దేవరకొండ రూ.10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట. నాని, శర్వానంద్ వంటి హీరోలు కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం లేదు..

కానీ విజయ్ అంత అడిగేసరికి దిల్ రాజు షాక్ అయ్యాడట. ప్రస్తుతం విజయ్ సినిమాలకు వస్తోన్న కలెక్షన్లు, జనాల్లో ఆయనకున్న క్రేజ్ ని బట్టి చూస్తే విజయ్ అడిగిన రెమ్యునరేషన్ సబబుగానే ఉంది. కానీ దిల్ రాజు మాత్రం అంత ఇవ్వడానికి సిద్ధంగా లేడట.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ చేస్తోన్న సినిమాకు కూడా ఇంతే మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి దిల్ రాజు ఏం చేస్తాడో చూడాలి!