Asianet News TeluguAsianet News Telugu

'జాతిరత్నాలు'లో గెస్ట్ అప్పీరియన్స్ ఈ ఇద్దరు స్టార్స్!

ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమాకూ రాని క్రేజ్ తెచ్చుకుంది ‘జాతిరత్నాలు’. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయతో మంచి గుర్తింపు సంపాదించిన నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ఇది. మహా నటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ కేవీ రూపొందించిన చిత్రమిది.  ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కామెడీ ఫిలిం ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో నవ్వులు పండించి, హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలో ఇద్దరు గెస్ట్ రోల్స్ లో ఉన్నారు. వాళ్లెవరో చూద్దాం. 

Vijay Devarakonda Guest Appearance in Jaathi ratnalu movie jsp
Author
Hyderabad, First Published Mar 12, 2021, 8:53 AM IST

ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమాకూ రాని క్రేజ్ తెచ్చుకుంది ‘జాతిరత్నాలు’. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయతో మంచి గుర్తింపు సంపాదించిన నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ఇది. మహా నటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ కేవీ రూపొందించిన చిత్రమిది.  ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కామెడీ ఫిలిం ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో నవ్వులు పండించి, హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలో ఇద్దరు గెస్ట్ రోల్స్ లో ఉన్నారు. వాళ్లెవరో చూద్దాం. 

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కీర్తి సురేష్,.. సెకండ్ హాఫ్ లో విజయ్ దేవకకొండ కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. కీర్తి సురేష్ - విజయ్ ఇద్దరూ కూడా నాగ్ అశ్విన్ తో క్లోజ్ గా ఉండటంతో ఇది సాధ్యమైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'మహానటి' సినిమాలో వీరిద్దరూ నటించిన విషయం తెలిసిందే. అలాగే 'ఎవడే సుబ్రహ్మణ్యం' లోనూ  విజయ్ దేవరకొండ చేసారు. ఇక  'జాతి రత్నాలు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా గెస్ట్ గా హాజరయ్యాడు. దీనికి తోడు నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ముగ్గురూ విజయ్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. ఈ పరిచయంతోనే విజయ్ దేవరకొండ  'జాతిరత్నాలు' సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించారు.

‘పోలీసులు, చట్టాల పట్ల ఎలాంటి అవగాహన లేని ముగ్గురు అమాయక యువకుల కథ ఇది. ఓ పెద్ద నేరంలో చిక్కుకున్న వారు ఏ విధంగా బయటపడ్డారనే కథాంశంతో వినోదాన్ని పంచుతుంది. సమకాలీన అంశాలతో సాగే  సెటైరికల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని తెరకెక్కించారు. సమాజంలో చోటుచేసుకుంటున్న వాస్తవాల్ని సీరియస్‌గా కాకుండా కామెడీ జోడించి ఈ సినిమాలో చెప్పారు.   జాతిరత్నాలుగా పిలవబడే  ముగ్గురు యువకులు  చేసే ప్రతి పని నుంచి బోలెడంత కామెడీ పుడుతుంది. నవీన్‌, రాహుల్‌రామకృష్ణ, ప్రియదర్శితో పాటు ప్రతి పాత్రకు సమ ప్రాధాన్యముంటుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios