విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' నుంచి ఫస్ట్ సింగిల్.. వినసొంపైన పాటలో ఇద్దరి కెమిస్ట్రీ హైలైట్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో వచ్చేసింది. ఎప్పటిలాగే గోపీ సుందర్ స్టైల్ ఉంది ఈ పాట.
విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రానికి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెమ్మదిగా ప్రమోషన్స్ జోరు పెంచుతున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఈ మూవీలో విజయ్ కి జోడిగా బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. తాజాగా విడుదలైన తొలి సాంగ్ గోపిసుందర్ స్టైల్ లోనే వినసొంపుగా ఆహ్లాద భరితంగా సాగుతోంది. గాయకుడు సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ఆకట్టుకుంటున్నాడు.
ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ రొమాన్స్ కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ చార్మినార్ వద్ద, మెట్రో ట్రైన్ లో వేస్తున్న స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా ఈ సాంగ్ కూల్ గా సాగిపోతోంది.
అదే విధంగా అనంత్ శ్రీరామ్ నంద నందనా అంటూ అందించిన లిరిక్స్ కూడా బావున్నాయి. ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ కి తగ్గట్లుగానే డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్లు ఉన్నారు. ఈ సాంగ్ చూస్తుంటే కాస్త గీత గోవిందం ఛాయలు కూడా కనిపిస్తున్నాయి.
లైగర్ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. ఖుషి కూడా పర్వాలేదనిపించింది. గీతా గోవిందం లాంటి సాలిడ్ హిట్ కోసం విజయ్ దేవరకొండ ప్రయత్నిస్తున్నాడు. మరి ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండకి సక్సెస్ తెచ్చిపెడుతోందా లేదా అనేది సమ్మర్ లో తేలిపోనుంది.