ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీస్తున్నారని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ పై ఫిల్మ్ సర్కిల్స్ , మీడియాలోనూ టాక్ బయిలుదేరింది.
తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఒకటనే సంగతి తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, గ్లింప్స్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ సినిమాపై మంచి బజ్ ,క్రేజ్ ఉంది.
ఇక ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీస్తున్నారని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ పై ఫిల్మ్ సర్కిల్స్ , మీడియాలోనూ టాక్ బయిలుదేరింది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం బడ్జెట్ 50 కోట్లు దాకా ఉండవచ్చు అంటున్నారు. ఇదే విజయదేవరకొండ సినిమాల్లో హైయిస్ట్ బడ్జెట్ అంటున్నారు. అయితే లైగర్ చిత్రం సైతం భారీ బడ్జెట్ తో రూపొందింది. బిజినెస్ బాగా జరుగుతుందని అంటున్నారు.
మరో ప్రక్క ఈ చిత్రం కథ ..చిరంజీవి సూపర్ హిట్ ‘గ్యాంగ్ లీడర్’కు పోలిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’మాదిరిగానే ఈ సినిమాలో ఇద్దరు అన్నల తమ్ముడిగా విజయ్ కనిపిస్తారు. అలాగే గ్యాంగ్ లీడర్ లో చిరు ఇంట్లోకి విజయశాంతి రెంట్‌కి దిగి.. ప్రేమలో పడే ఎపిసోడ్ ఉంటుంది. ఇక్కడ ఈ సినిమాలోనూ విజయ్ ఇంట్లో మృణాల్ అద్దెకు దిగి, ప్రేమలో పడుతుందని అంటున్నారు. అయితే ‘గ్యాంగ్ లీడర్’లో ప్రత్యేకమైన విలన్ , రివైంజ్ ఉంటంది. ఇక్కడ మాత్రం కథ మాత్రం ‘గీత గోవిందం’తరహాలో సాగుతుందని, ఆమె పైనే హీరో సరదాగా రివేంజ్ తీర్చుకుంటాడని , ఆ క్రమంలో వచ్చే కామెడీ, ఎమోషన్ సినిమాకు సినిమాని నిలబడతాయని నమ్ముతున్నారట. ‘గీత గోవిందం’కు ఓ వెర్షన్ లా గ్యాంగ్ లీడర్ స్క్రీన్ ప్లే డిజైన్ లో సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఏదైమైనా రెండూ సూపర్ హిట్స్ కాబట్టి ఈ సినిమా కూడా అదే స్దాయిలో వర్కవుట్ కావచ్చు.
ఫ్యామిలీ, మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్, సంగీతం: గోపీసుందర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: వాసు వర్మ, రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల.
Read more: `కల్కి2898ఏడీ`లో ప్రభాస్ పాత్ర ఇదే.. అఫీషియల్‌గా ప్రకటించిన టీమ్..