Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో విజయ్ దేవరకొండ హంగామా.. నిఖిల్ చేతుల మీదుగా 'సారంగదరియా’ ట్రైలర్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఇండియన్ ఐడల్ సీజన్ 3 వేదికపై విజయ్ కి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. 

Vijay Devarakonda enters into Telugu Indian Idol season 3 dtr
Author
First Published Jul 4, 2024, 8:54 PM IST

రాజా రవీంద్ర 'సారంగదరియా' ట్రైలర్ 

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమాను జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌, లెజెండ్రీ సింగర్ కె.ఎస్‌.చిత్ర‌ పాడిన ‘అందుకోవా’,  ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నిఖిల్ చేతుల మీదుగా విడుదల చేయించారు.

‘కులం అంటే రక్తం కాదు.. పుట్టుకతో రావడానికి..  మనం చేసే పనే కులం’.., ‘మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌లకంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీ పడి బతికేలా చేస్తుంది.. నువ్వింతే.. ఇంతకు మించి ఏం చేయలేవని చెప్పి బాస్ అయి కూర్చుంటుంది’.. ‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అనే డైలాగ్స్ సినిమాలోని కథ, పాత్రల లోతుని చూపిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ కష్టాలను చూపించినట్టుగా అనిపిస్తోంది.

ఈ ట్రైలర్‌లో రాజా రవీంద్ర నటనను చూస్తే అందరినీ కదిలించేలా ఉంది. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్, గొప్ప ఉపాధ్యాయుడిగా కనిపించినట్టు అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే పాటలు, ఆర్ఆర్ చక్కగా ఉన్నాయి. వినయ్ కొట్టి రాసిన డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. జూలై 12న ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.

నటీనటులు
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహ‌మ‌ద్‌ ,మోహిత్ పేడాడ‌, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు 

అమ్మ సెంటిమెంట్ తో ఫిదా చేసిన విజయ్ దేవరకొండ 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఇండియన్ ఐడల్ సీజన్ 3 వేదికపై విజయ్ కి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ఒక సింగర్ గీతా గోవిందం చిత్రంలోని ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే అనే సాంగ్ పాడాడు. ఆ సాంగ్ ని విజయ్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అదే విధంగా ఆ సింగర్ తన తన తల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. దీనితో విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఇంట్లో అమ్మ సంతోషం గా ఉంటే చాలు అలా చూస్తూ గడిపేయొచ్చు అంటూ అమ్మ సెంటిమెంట్ తో ఫిదా చేశాడు. 

Vijay Devarakonda enters into Telugu Indian Idol season 3 dtr

వేదికపై విజయ్ దేవరకొండ, తమన్, ఓ చిన్న పిల్లాడు కలసి క్రికెట్ కూడా ఆడారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios