విజయ్ దేవరకొండ, దిల్ రాజు చిత్రం టైటిల్ ఇదేనా?
తాజాగా రవికిరణ్ తో చేస్తున్న చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయిటకు వచ్చింది. ఈ చిత్రానికి ఓ టైటిల్ ని ఖరారు చేసారని వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) దిల్ రాజు నిర్మాణంలో రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి పరశురాం దర్శకత్వంలో కాగా,మరొకటి , రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా. ప్రస్తుతం రవికిరణ్ చేయబోతున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో వుంది. తాజాగా రవికిరణ్ తో చేస్తున్న చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయిటకు వచ్చింది. ఈ చిత్రానికి ఓ టైటిల్ ని ఖరారు చేసారని వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన 'రాజా వారు రాణి గారు' చిత్రంతో రవికిరణ్ కోలా దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. 2019 లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మరో సినిమా డైరక్ట్ చేయలేదు. మధ్యలో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రానికి మాత్రం రచయితగా చేసాడు. అయితే ఇప్పుడు దర్శకుడిగా రవికిరణ్ రెండో సినిమా ప్రకటన వచ్చింది. అది కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో కావడంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది.
డైరెక్టర్ రవికిరణ్ సోషల్ మీడియాలో 'Vicious Dynamite' అంటూ 'VD'(విజయ్ దేవరకొండ) పేరు వచ్చేలా హింట్ ఇచ్చాడు. అంతేకాదు ఇదొక గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ అని టాక్. ఈ చిత్రానికి ‘యుద్ధం’ (Yuddham) అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారం. 1980 మాఫియా నేపధ్యంలో సాగే చిత్రానికి ఓ పవర్ ఫుల్ టైటిల్ కోసం అన్వేషిస్తున్న మేకర్స్.. యుద్ధం టైటిల్ ని లాక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్ తొలిసారి పూర్తి యాక్షన్ తో మన ముందుకు రానున్నారు.
ఈ సినిమాలతో పాటు విజయ్ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి చిత్రం సైతం యాక్షన్ ప్రధానంగా సాగే స్పై థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా రెండు పార్ట్ లు గా ఉండబోతుంది. నాగవంశీ నిర్మించబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ 'జటాయు'లో కూడా విజయ్ నటించే అవకాశముందని సమాచారం.