విజయ్ దేవరకొండకు వారితో సమస్యా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 14, Aug 2018, 4:51 PM IST
vijay devarakonda controversy with geetha arts pr team
Highlights

విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా పిఆర్ టీమ్ ని ఏర్పాటు చేసుకున్నారు. వారి సహాయంతో సరికొత్త రీతిలో వినూత్నంగా తన సినిమాను ప్రమోట్ చేయాలనేది విజయ్ ప్లాన్

'అర్జున్ రెడ్డి' సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అతడు నటించిన 'గీత గోవిందం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు కావాల్సిన పబ్లిసిటీకి తనవంతు కృషి చేస్తున్నప్పటికీ అదంతా ఇష్టం లేకుండా చేస్తున్నాడట విజయ్. ఒక్కొక్కసారి ప్రచార కార్యక్రమాల డేట్స్ మార్చమని ఆఖరి నిమిషంలో చెబుతున్నాడట.

దానికి కారణంగా విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా పిఆర్ టీమ్ ని ఏర్పాటు చేసుకున్నారు. వారి సహాయంతో సరికొత్త రీతిలో వినూత్నంగా తన సినిమాను ప్రమోట్ చేయాలనేది విజయ్ ప్లాన్. కానీ గీతాఆర్ట్స్ సంస్థకు చెందిన పిఆర్ టీమ్ సినిమా ప్రచార బాధ్యతలు తీసుకోవడంతో విజయ్ ఆశించిన విధంగా ప్రమోషన్స్ జరగడం లేదు. కానీ పెద్ద బ్యానర్ కావడంతో విజయ్ కూడా సైలెంట్ గా ఉండిపోతున్నాడట.

కానీ గీతాఆర్ట్స్ మనుషులను మాత్రం కాస్త ఇబ్బంది పెడుతున్నాడని సమాచారం. అన్ని సినిమాల మాదిరి వీడియో ఇంటర్వ్యూలు ప్లాన్ చేసి విజయ్ కి చెబితే ముందు వస్తానని తరువాత డేట్ మార్చమని పిఆర్ టీమ్ ని విసిగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒక్కరి సినిమాతో ఈ బాధ తీరిపోతుందనుకుంటే కాదు.. 'టాక్సీవాలా' సినిమాలో గీతాఆర్ట్స్ ప్రొడక్షన్ నుండి వస్తున్నదే కావడంతో గీతాఆర్ట్స్ మనుసులు తలలు పట్టుకుంటున్నారట. 

loader