యంగ్ హీరో విజయ్ దేవరకొండకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ అభిమానులు కొందరు అతడి చిన్నప్పటి వీడియోలను సేకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

మరికొందరు ఆ వీడియోలకు పేరడీలు కూడా చేస్తున్నారు. మొదట విజయ్ అభిమాని ఒకరు వీడియోని పోస్ట్ చేస్తూ విజయ్ ని ట్యాగ్ చేశారు. 'ఈ బాలుడు విజయ దేవరకొండేనా..? నాకు తెలియడం లేదు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ వీడియోలో విజయ్ 'అయితే చదువు మానేసి పుట్టపర్తికి వచ్చిన స్వామి వారు ఇక్కడ ఏం చేసేవారు టీచర్' అని షావుకారు జానకిని అడుగుతాడు. ఈ వీడియో చూసిన విజయ్.. తన చిన్నప్పటి విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నట్లున్నాయని, ఈ బాలుడు కూడా స్టారే అంటూ ఆ వీడియో పోస్ట్ చేసిన అభిమానికి ధన్యవాదాలు చెప్పారు.

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.