అతి తక్కువ కాలంలో స్టార్ డమ్ తెచ్చుకోవడం అంటే ఈ పోటీ ప్రపంచంలో సాధారణమైన విషయం కాదు. కానీ విజయ్ దేవరకొండ లాంటి కుర్ర హీరోలు ఒకే ఒక్క సినిమాతో కెరీర్ నే మార్చుకోవడం చాలా గొప్ప విషయమని చెప్పాలి. ఈ ఏడాది గీత గోవిందం హిట్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విజయ్ ఆ తరువాత నోటా తో డిజాస్టర్ అందుకున్నాడు. 

ఇక అనంతరం ట్యాక్సీ వాలా తో మరో బెస్ట్ మూవీ అందించి ఆడియెన్స్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే విజయ్ దేవరకొండ బిజినెస్ లలో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాడు. స్టార్ డమ్ ఉన్నప్పుడే తన బ్రాండ్ వాల్యూ పెంచుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవడంతో మంచి బిజినెస్ మెన్ గా కూడా గుర్తింపు అందుకుంటున్నాడు. 

రౌడీ వేర్ బిజినెస్ ఇటీవల కాలంలో 100 కోట్ల టర్నోవర్ మార్క్ అందుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇంకా తన బిజినెస్ ను పెంచే స్థాయిలో ఉన్నట్లు కుర్ర హీరో ప్లాన్ చేస్తున్నాడట. దానితో పాటు నోటా సినిమాతో కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ బ్యానర్ నుంచి త్వరలోనే ఒక వెబ్ సిరీస్ రానున్నట్లు విజయ్ తెలిపాడు.