టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే మలయాళం - కన్నడ - తమిళ్ ప్రేక్షకులకు డియర్ కామ్రేడ్ తో దగ్గరైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ద్విభాషా చిత్రాలతో రెడీ అవుతున్నాడు. 

నెక్స్ట్ హిందీలో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొంత కాలంగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే డెబ్యూ సినిమా లాంచ్ డేట్ కూడా దగ్గరపడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అలాగే సిద్దార్థ్ రాయ్. సాజిద్ వంటి ప్రముఖుల ద్వారా విజయ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 6న అధికారికంగా విజయ్ మొదటి బాలీవుడ్ సినిమాను లాంచ్ చేయనున్నట్లు టాక్. అయితే సినిమా దర్శకుడు అలాగే ఇతర తారాగణం టెక్నీషియన్స్ కి సంబందించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.