టాలీవుడ్‌ రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ బర్త్ డే రేపు(మే9). ఈ సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీని విడుదల చేశారు. అధికారికంగా విడుదల చేసిన బర్త్ డే సీడీపీ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. `లైగర్‌` పేరుతో దీన్ని ట్రెండ్‌ చేస్తున్నారు విజయ్‌ ఫ్యాన్స్. ప్రస్తుతం విజయ్‌ `లైగర్‌` చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఆ పేరుతో అభిమానులు ట్రెండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా బర్త్ డే సీడీపీని వైరల్‌ చేస్తున్నారు. ఇందులో పెద్ద కోటపై విజయ్‌ రాజులాగా ఉండగా, స్టేడియం లోపల ఆడియెన్స్ గోల చేస్తున్నట్టుగా ఉన్న బర్త్ డే సీడీపీ డిజైన్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. విజయ్‌ హవాని, క్రేజ్‌ని చాటుతుంది. 

2011లో `నువ్విలా` చిత్రంతో నటుడిగా తెలుగు తెరకి పరిచయం అయిన విజయ్‌ దేవరకొండకి బ్రేక్ రావడానికి ఐదేళ్లు పట్టింది. 2016లో వచ్చిన `పెళ్లిచూపులు` చిత్రంతో తొలి విజయాన్ని అందుకుని టాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యారు. అంతకు ముందు `ఎవడే సుబ్రమణ్యం`లోనూ తనదైన స్టయిల్‌లో ఆకట్టుకున్నారు. ఇక `అర్జున్‌రెడ్డి`తో టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాడు. లవ్‌ స్టోరీలోని ఓ కొత్త పంథాని ఆవిష్కరించారు. ఆ వెంటనే `గీతగోవిందం` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే స్టార్‌ హీరోల కేటగిరిలో చేరిపోయాడు. ఆ సమయంలో విజయ్‌ క్రేజ్‌కి చిరంజీవి, అల్లు అర్జున్‌, మహేష్‌ లాంటి స్టార్ హీరోలే ఆశ్చర్యపోవడం విశేషం. 

ఆ తర్వాత వరుసగా పరాజయాలు చవిచూస్తున్న విజయం ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో `లైగర్‌` చిత్రంలో నటిస్తున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందే చిత్రమిది. తెలుగు, హిందీలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. దీన్నిసెప్టెంబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.