టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. అలాగే మార్కెట్ ని కూడా పెంచుకుంటున్న విజయ్ సినీ కెరీర్ లో  మొదటిసారి బారి బడ్జెట్ సినిమాలో నటించబోతున్నాడు. గీత గోవిందం సినిమా విజయ్ మార్కెట్ ను పెంచడంలో కీలకపాత్ర పోషించింది. 

ఆ సినిమా 70కోట్లకు పైగా లాభాల్ని అందించింది. అయితే ఇప్పుడు మూడు సినిమాలతో విజయ్ బిజీగా ఉన్నాడు. డియర్ కామ్రేడ్ రిలీజ్ కి రెడీగా ఉండగా క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో  తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ బైక్ రేజర్ గా కనిపించబోతున్నాడడు. 

ఈ సినిమాను దాదాపు 50కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు బైక్ రేజింగ్ సన్నివేశాల కోసమే 10కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. తెలుగు - తమిళ్ లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో విజయ్ నోటా సినిమాను ఇదే తరహాలో రెండు భాషల్లో తెరకెక్కించారు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. మరి ఈ సినిమాతో విజయ్ తమిళ్ ఆడియెన్స్ ను ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తాడో చూడాలి.