అఫీషియల్: గీత గోవిందం దర్శకుడితో విజయ్ దేవరకొండ మరోసారి.. దిల్ రాజుతో చేతులు కలిపారుగా..
రౌడీ హీరో మరో క్రేజీ చిత్రాన్ని ప్రకటించాడు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో మరో చిత్రం చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ అయ్యాడు.

లైగర్ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ విజయ్ దేవరకొండ జోరు ఆగడం లేదు. ఇప్పటికే విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చిత్రానికి కూడా అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చింది.
ఇప్పుడు ఈ రౌడీ హీరో మరో క్రేజీ చిత్రాన్ని ప్రకటించాడు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో మరో చిత్రం చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ అయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చింది. దిల్ రాజు, పరశురామ్, విజయ్ దేవరకొండ ముగ్గురూ కలసి ఉన్న క్రేజీ పిక్ పోస్ట్ చేస్తూ ఈ చిత్రాన్ని ప్రకటించారు.
పరశురామ్ విజయ్ దేవరకొండకి గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఆ చిత్ర విజయంతో పరశురామ్ కి సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. మహేష్ తో తెరకెక్కించిన సర్కారు వారి పాట చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ ఆయా చిత్రంపై చాలా మంది క్రిటిక్స్ పెదవి విరిచారు. దీనితో పరశురామ్ తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ తరుణంలో పరశురామ్ పై విజయ్ దేవరకొండ మరోసారి నమ్మకం ఉంచాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం అని తెలిపారు. సరికొత్త పాయింట్ తో పరశురామ్ ఈ చిత్ర కథ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రౌడీ హీరో చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.