Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండ స్పీడు మాములుగా లేదుగా!

పృథ్వీసేన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో కొత్త వారికి అవకాశం ఇస్తు మొత్తం నూతన నటీనటులతో ఈ మూవీని రూపొందిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా కూడా రెగ్యులర్ షూటింగు ప్రారంభించాలని చూస్తున్నట్లు విడికిడి. 
 

Vijay Devarakonda again as a producer jsp
Author
Hyderabad, First Published Jun 1, 2021, 11:54 AM IST

హీరోగా సెన్సేషనల్ సక్సెస్ ని నమోదు చేసుకున్న విజయ్ దేవరకొండ నిర్మాతగానూ తనదైన దూకుడు చూపిస్తున్నారు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకోవడానికీ .. తొలి సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు విజయ్‌ సొంతంగా ‘కింగ్ ఆఫ్ ది హిల్’ పేరుతో బ్యాన‌ర్ స్టార్ట్ చేసి ఇప్పటికే ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీని నిర్మించాడు. ఇందులో విజయ్‌ పెళ్లి చూపులు సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌ధాన పాత్ర పోషించాడు. తాజాగా తన ప్రొడక్షన్‌ మరో మూవీని నిర్మించేందుకు సిద్దమయ్యాడు విజయ్‌.

 తన సోదరుడు ఆనందర్‌ దేవరకొండ హీరోగా ‘పుష్పక విమానం’ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు. అలాగే ఈ మూవీతో పాటు మరో చిత్రాన్ని కూడా విజయ్‌ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పృథ్వీసేన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో కొత్త వారికి అవకాశం ఇస్తు మొత్తం నూతన నటీనటులతో ఈ మూవీని రూపొందిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా కూడా రెగ్యులర్ షూటింగు ప్రారంభించాలని చూస్తున్నట్లు విడికిడి. 
 
 ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

అలాగే సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న సుకుమార్ తర్వాత విజయ్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. .సుకుమార్ తో సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండ లైగర్ తో సహా మూడు సినిమా లను చేయబోతున్నాడు.  వీటిలో ఒకటి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఉంది. అయితే ఈ మూడు సినిమాల తర్వాత సుకుమార్ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇటీవలే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు విజయ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios