సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రావడాలంటే కష్టంతో లక్కు కూడా ఉండాలి. యువ దర్శకులు ప్రస్తుతం మొదటి ఛాన్స్ కోసం స్టార్ హీరోల చుట్టూ ఎల్లా తరబడి తిరిగితే గాని ఆఫర్స్ రావడం లేదు. అయితే డియర్ కామ్రేడ్ సినిమాతో కూడా ఇప్పుడు యువ ఒక యువ దర్శకుడి లైఫ్ కూడా మారిపోనుందని అర్ధమవుతోంది.

విజయ్ స్టార్ కాకముందు నుంచి భరత్ కమ్మకు చాలా దగ్గరగా ఉన్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో తన మేకింగ్ స్టైల్ ఏంటో చూపించిన భరత్ అంటే విజయ్ కు చాలా నమ్మకం. అయితే ఎప్పుడో ఈ యువ డైరెక్టర్ కి మాట ఇచ్చేశాడు. నీతో తప్పకుండా సినిమా చేయాలి అని చెప్పి ఫైనల్ గా డియర్ కామ్రేడ్ సినిమాతో వచ్చేశాడు. 

ఫస్ట్ ఈ సినిమాను ఎదో చిన్న బడ్జెట్ లో ప్లాన్ చేసుకున్నారు. కానీ అర్జున్ రెడ్డి - గీతా గోవిందం సినిమాలతో విజయ్ బాక్స్ ఆఫీస్ రేంజ్ 50 కోట్లను ఈజీగా దాటేసింది. దీంతో డియర్ కామ్రేడ్ సినిమాను నిర్మించడానికి మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా బ్యానర్ లోకి దిగింది. తెలుగులోనే కాకుండా సౌత్ లో ఉన్న తమిళ్ - కన్నడ - మలయాళ భాషల్లో గ్రాండ్ గా సినిమాను విడుదల చేయడానికి ట్రై చేస్తున్నారు. 

ఈ సినిమా 100 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. దర్శకుడు భరత్ తన మొదటి సినిమా ఈ రేంజ్ లో ఉంటుందని కలలో కూడా ఉహించుకొని ఉండడు. ఈ సినిమా హిట్టయితే భరత్ కమ్మ రేంజ్ కూడా సౌత్ లో గట్టిగానే పెరుగుతుందని చెప్పవచ్చు. మరి సమ్మర్ మిడ్ లో రాబోయే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.