కోలీవుడ్ స్టార్ హీరో ఇళయథలపతి విజయ్ మరోసారి టాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ పెట్టాడు. అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న బిగిల్ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కు సిద్ధమవుతోంది.  అదిరింది (మెర్శల్) - సర్కార్ సినిమాలతో టాలీవుడ్ లో కొంత మార్కెట్ ను పెంచుకొని బయ్యర్లకు మంచి లాభాలను అందించిన విజయ్ ఇప్పుడు బిగిల్ సినిమాతో సిద్దమయ్యాడు. 

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ సంస్థ మహేష్ కోనేరు బిగిల్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ని దక్కించుకున్నారు. ఇక తమిళ్ తో పాటే తెలుగులో కూడా సినిమాను దీపావళి కనుగగా రిలీజ్ చేయబోతున్నారు. మొదటిసారి విజయ్ సినిమా ఆంద్రప్రదేశ్ - నైజాంలో 400కు పైగా స్క్రీన్స్ లలో రిలీజ్ కాబోతోంది. తేరి - మెర్శల్ వంటి బాక్స్ బాక్స్ ఆఫీస్ చిత్రాల దర్శకుడు అట్లీ బిగిల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 

ముడవసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో తమిళ్ ప్రజలతో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు, సీనియర్ హీరోయిన్ న‌య‌న‌తార న‌టిస్తోన్న‌ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు.